Kaizer News

Kadiri Kaalidas | ‘కదిరి కాళిదాస్’.. ‘కాకా’ నుంచి

Kadiri Kaalidas | ‘కదిరి కాళిదాస్’.. ‘కాకా’ నుంచి మెగాస్టార్ క్రేజీ అప్‌డేట్!

· Entertainment · ntnews.com

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’ (Kaaka). ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలో త‌న పాత్ర‌కు సంబంధించి లీక్స్ ఇచ్చాడు చిరంజీవి. ఇటీవల జరిగిన ఓ సినిమా వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి, స్టేజ్ పై సరదాగా మాట్లాడుతూ తన పాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికర హింట్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో ఆయన ‘కదిరి కాళిదాస్’ అలియాస్ ‘సత్యం’ అనే విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. పైకి సాధారణ ప్రజలకోసం ఓ ఆక్వా ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేసే సాధారణ వ్యక్తిలా సత్యం కనిపిస్తారని, కానీ తెరవెనుక అండర్‌వాల్డ్‌ను శాసించే శక్తిగా ‘కదిరి కాళిదాస్’ రూపంలో ఆయన అసలు నిజస్వరూపం బట్టబయలవుతుందని సమాచారం. ఈ చిత్రంలో తండ్రీకూతుళ్ల మధ్య వచ్చే బలమైన భావోద్వేగాలు కథకు ప్రధాన ఆత్మగా నిలవనున్నాయి. మలయాళీ నటి అనస్వర రాజన్ చిరంజీవి కూతురు ‘అమ్ములు’ పాత్రలో నటిస్తుండగా, ఆమె మెడిసిన్ చదివే విద్యార్థినిగా కనిపించనుంది. వీరిద్దరి మధ్య నడిచే ఎమోషనల్ బాండింగ్ ప్రేక్షకులను కంటతడి పెట్టించడంతో పాటు సినిమాకే హైలైట్‌గా మారుతుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ పక్కా ప్రణాళికతో సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ కూడా రానుండటంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాకా… కదిరి కాళిదాస్ 👌 #KAAKA pic.twitter.com/mXUuhJYN2c

Original source: ntnews.com
Read more on Kaizer News