Kaizer News

Tirupati: తిరుపతిలో అమరా సిటీ సెంటర్ ప్రారంభం: అక్

Tirupati: తిరుపతిలో అమరా సిటీ సెంటర్ ప్రారంభం: అక్టోబర్ 31 వరకు ఉచిత ఓపీ

· City - Hyderabad · hmtvlive.com

Shorts తిరుపతి: తిరుపతిలోని అన్నారావు సర్కిల్‌ సమీపం హరేకృష్ణ రోడ్డులో అమరా హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరా సిటీ సెంటర్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా రవాణా అధికారి (డిటిఓ) మురళి మోహన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాకర్స్‌ అసోసియేషన్‌, రిటైర్డ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, టీటీడీ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం,టీటీడీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరా హాస్పిటల్‌ సీబీఓ డి. వేణుగోపాల్‌ మాట్లాడుతూ తిరుపతి, పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.అమరా సిటీ సెంటర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్‌ 31, 2026 వరకు సాధారణ ప్రజలకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత ఓపి కన్సల్టేషన్‌ అందించనున్నట్లు తెలిపారు. అలాగే టీటీడీ ఉద్యోగులు, రిటైర్డ్‌ టీటీడీ ఉద్యోగులకు 24 గంటలూ ఉచిత ఓపి కన్సల్టేషన్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.సిటీ సెంటర్‌లో జనరల్‌ మెడిసిన్‌,ఓబీజీ, పీడియాట్రిక్స్‌, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్టి విభాగాలు అందుబాటులో ఉంటాయి. అదనంగా 24/7 ల్యాబ్‌ శాంపిల్‌ కలెక్షన్‌, 24/7 ఫార్మసీ, ఉచిత మందుల హోమ్‌ డెలివరీ, ఉచిత హోమ్‌ బ్లడ్‌ శాంపిల్‌ కలెక్షన్‌ సేవలు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు జి ఆర్ బి ఎస్ బీపీ, ఈసీజీ,2డి ఎకో సేవలు కూడా అందుబాటులో ఉంటాయని వెల్లడించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News