ముందస్తు బెయిల్ ప్రయత్నానికి నిందితులకు సమయం మొన్న బండి కేసు.. నేడు ఆర్‌సీపురం ఘటనలో అదే తీరు నిందితుడిని కాపాడేందుకు రంగంలోకి రాజకీయ పెద్దలు ‘సింహం’ లాంటి అనుచరులతో కుదిరిన ఒప్పందం? రూ. 50 లక్షల డీల్? సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసులో నిందితుల అరెస్ట్ విషయంలో కొందరు నిర్లక్ష్యం వహిస్తుండగా.. మరికొందరు నిందితులతో రాజీకుదర్చుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాలిక భద్రత కోసం తెచ్చిన కఠినమైన పోక్సో చట్టం కూడా రాజకీయ బలం, ధన బలం ముందు మోకరిల్లుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంలో మీనమేషాలు లెక్కించారు. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. బండి భగీరథ్‌ను కాపాడేందుకు రాజకీయ పలుకుబడిని ఉపయోగించారనే ఆరోపణలు సైతం వచ్చాయి. తాజాగా ఆ కీలక కమిషనరేట్ పరిధిలోనే ఓ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన ఓ పోక్సో కేసులోనూ అధికార పార్టీ కీలక నేతలకు ‘సింహం’ లాంటి అనుచరులు రంగంలోకి దిగి పోక్సో నిందితులను కాపాడేందుకు రాజీ ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా విన్పిస్తున్నాయి… ఇందుకు ప్రతి ఫలంగా నిందితులతో రూ. 50 లక్షల భారీ డీల్ కుదిరినట్లు స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బండి భగీరథ్‌పై నమోదైన మిగతా పోక్సో కేసులోను పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేయడంలో మీనమేషాలు లెక్కించి, ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురయ్యే వరకు వేచి చూశారు. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. నిందితుడి తండ్రి ఓ జాతీయ పార్టీలో కీలక పదవిలో ఉండడంతో రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తూ కేసు నమోదు కాకుండానే అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. పోక్సో కేసుల విషయంలో పోలీసులు అవలంభిస్తున్న ద్వంద నీతిపై ప్రజలు వివిధ రకాలుగా మాట్లాడుకుంటున్నారు. బండి భగీరథ్ కేసులో నిందితుడిని కేసు నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన వారిపై కూడా కేసులు నమోదు చేయాల్సి ఉన్నా పోలీసులు ఆ విషయాన్ని తేలికగా తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా మరో కేసు సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో కొంత మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రాజకీయ పలుకుబడి ఉన్న వారు నెల రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నా పట్టుకోవడం లేదని, దీని వెనుక భారీ డీల్ జరిగి ఉంటుందనే ఆరోపణలు చేస్తున్నారు. ఓ ఆలయం వద్ద పనిచేసే ఓ 60 ఏండ్ల వృద్ధుడు ఆలయం వద్దకు వచ్చే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఫిర్యాదుపై కీలకమైన కమిషనరేట్ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో గత నెల 14న పోక్సో కేసు నమోదయ్యి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇందులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులకు, దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో మొత్తం నలుగురు నిందితులుగా తేల్చి అందులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న నిందితుడు గతంలో టీడీపీలో స్థానిక నాయకుడిగా చలామణి అయ్యాడు. గతంలో టీడీపీ నాయకుడిగా ఉండటంతో అప్పటి పరిచయాలతో ఈ కేసులో అరెస్ట్ కాకుండా చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలు ఉన