Kaizer News

Warangal Airport: సందీప్ రెడ్డి వంగా, రేవంత్‌రెడ్డ

Warangal Airport: సందీప్ రెడ్డి వంగా, రేవంత్‌రెడ్డిల మధ్య ఆసక్తికర ట్వీట్స్.. సినిమా స్టైల్లో సీఎం పంచ్..!

· Entertainment · hmtvlive.com

Shorts Warangal Airport: చారిత్రక నగరమైన వరంగల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం కల సాకారం కాబోతుండటంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మామునూరు ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెట్టాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రజల నుంచి సూచనలు కోరగా.. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తన సొంత ప్రాంతంపై ఉన్న మమకారాన్ని చాటుకుంటూ అద్భుతమైన పేర్లను ప్రతిపాదించారు. సందీప్ రెడ్డి వంగా సూచించిన పేర్లు ఇవే.. ‘రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ’ ‘కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’. వరంగల్‌కు ఉన్న గొప్ప చారిత్రక నేపథ్యం, కాకతీయుల వారసత్వాన్ని, రాణి రుద్రమదేవి కీర్తిని ప్రతిబింబించేలా ఈ పేర్లు ఉంటే ఎంతో సార్థకత ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ ట్వీట్‌కు సీఎం రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. 'That’s the spirit' అంటూ రిప్లై ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం సందీప్‌రెడ్డి వంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే పదాన్ని సీఎం తన రిప్లైలో వాడటంతో సినీ అభిమానులు, నెటిజన్లు దీనిపై తెగ చర్చించుకుంటూ పోస్టులు షేర్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం జరుపుతున్న నిరంతర చర్చల ఫలితంగా మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూసేకరణ పూర్తయి, ఆ భూమిని ఇప్పటికే ఏఏఐకి అప్పగించారు. డిసెంబరులో ఈ పనులకు శంకుస్థాపన చేసేలా కసరత్తు జరుగుతోంది. కేవలం విమాన రాకపోకలే కాకుండా.. ఉత్తర తెలంగాణలో పరిశ్రమలు, పర్యాటకం, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచే కీలక మౌలిక వసతిగా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం మలుస్తోంది. మొత్తానికి, వరంగల్ ఎయిర్‌పోర్టు పేరుపై సినీ, రాజకీయ ప్రముఖుల భాగస్వామ్యం ఈ ప్రాజెక్టుపై మరింత హైప్ తీసుకొచ్చింది. మరి ఈ చారిత్రక విమానాశ్రయానికి ఏ పేరు ఖరారు కానుందనేది త్వరలోనే తేలనుంది. 2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది

Original source: hmtvlive.com
Read more on Kaizer News