Kaizer News

‘ఐయామ్‌ మలాలా’ బుక్‌ ఎందుకు చదువుతున్నారు?

‘ఐయామ్‌ మలాలా’ బుక్‌ ఎందుకు చదువుతున్నారు?

· National - India · sakshi.com

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, పాకిస్తాన్‌ సాహస బాలిక మలాలా యూసఫ్‌జాయ్‌ ఆత్మకథ ‘ఐయామ్‌ మలాలా’పుస్తకాన్ని యువకులు చదువుతుండగా, కొందరు వ్యక్తులు హఠాత్తుగా వచ్చి దాడి చేశారు. తమను తాము మితవాద కార్యకర్తలుగా చెప్పుకునే కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం సాయంత్రం వస్త్రపుర గార్డెన్‌లో పఠన కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఔత్సాహికులు ఒక బృందంగా తమకు నచి్చన పుస్తకాలు చదువుకొని, వాటిపై చర్చిస్తుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐయామ్‌ మలాలా బుక్‌ను చదువుతుండగా, దాదాపు 20 మంది అక్కడికి దూసుకొచ్చారు. ఆ పుస్తమే ఎందుకు చదువుతున్నారని ప్రశి్నస్తూ కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు యువకులకు గాయాలయ్యారు. తాము బజరంగ్‌ దళ్, విశ్వ హిందూ పరిషత్‌ కార్యకర్తలమని చెప్పుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పటిదాకా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులతో బాధితులకు ముందే పరిచయం ఉందని పోలీసులు వెల్లడించారు. కొన్ని వారాల క్రితం మితవాద వర్గాల నిరసనల కారణంగా అహ్మదాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో యూసఫ్‌జాయ్, హోలోకాస్ట్‌ బాధితురాలు అన్నే ఫ్రాంక్‌ రాసిన పుస్తకాలను తమ తప్పనిసరి పఠన జాబితా నుండి తొలగించాల్సి వచి్చంది. హైదరాబాద్‌లో స్పోర్ట్ ఎక్స్‌పో ఇండియా 2026 ప్రారంభం (ఫొటోలు) 'ఇరుముడి' కావేరీ.. షూటింగ్‌లో ఎలా ఎంజాయ్ చేసిందో చూశారా? (ఫొటోలు) హైదరాబాద్ లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు) ప్రశ్నించినందుకు TDP ఆఫీస్ కు లాక్కెళ్లి కొట్టారు.. చంద్రబాబు, పవన్, లోకేష్ ల హెలికాప్టర్లు ఖర్చు 110 కోట్లా

Original source: sakshi.com
Read more on Kaizer News