Kaizer News

ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌ ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎ

ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌ ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

· Entertainment · sakshi.com

ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ నేచురల్ మిస్టిక్ హారర్‌ థ్రిల్లర్‌ ‘అగధ’. ‘మా ఊరి పొలిమేర’ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత విజువల్‌ ఎఫెక్ట్స్‌తో.. ‘అగధ’ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్‌ 25 నుంచి సినిమాను స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో థియేటర్లలో మిస్‌ అయిన ప్రేక్షకులు ఇంటి నుంచే ఈ మిస్టిక్‌ థ్రిల్లర్‌ను చూసే అవకాశం దక్కింది. రెండు గంటల 17 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రానికి థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత విజువల్‌ ఎఫెక్ట్స్‌తో పాటు హీరోహీరోయిన్లు, ఇతర నటీనటుల పెర్ఫార్మెన్స్‌కు ప్రశంసలు దక్కాయి. హారర్‌, మిస్టరీ థ్రిల్లర్‌ సినిమాలను ఇష్టపడే వారికి ‘అగధ’ ఓటీటీ ప్రీమియర్‌ ఆసక్తికరంగా మారింది. కథ ఏంటంటే .. మహిమ (ఉల్కా గుప్తా) ఒకానొక సందర్భంలో తన స్నేహితులతో కలిసి అడవిలోకి వెళ్తుంది. అక్కడ ఓ గుహను చూస్తుంది. ఆ గుహ వద్ద ఓ వింత ఘటన జరుగుతుంది. ఆ సమయంలో ఆమె స్నేహితుడు బబ్లూ మరణిస్తాడు. ఆమె ప్రేమికుడు సింహా (శ్రవణ్ రెడ్డి) మాత్రం కనిపించడు. ఇంకో వైపు మహాదేవి (కామాక్షి భాస్కర్ల) ఊర్లోని ప్రజల సమస్యలను తీరుస్తూ ఉంటుంది. ఆత్మలకు మోక్షం కలిగిస్తుంటుంది. ఇక కొన్ని రోజులకు మహిమ ఆత్మహత్య చేసుకుంటుంది. తన సోదరి మహిమ మరణంతో మహాదేవి సొంత ఊరికి వస్తుంది. తన ఇంటికి, కుటుంబ సభ్యులకు సమస్య ఉందని మహాదేవి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో సింహా నుంచి మహాదేవి తెలుసుకున్న అంశాలు ఏంటి? ఈ షికావో గుహ వద్ద ఏం జరిగింది? అసలు ఈ అగధ ఎవరు? మహాదేవి కుటుంబాన్ని ఈ అగధ ఎందుకు చంపుతోంది? చివరకు అగధను మహాదేవి ఏం చేస్తుంది? ఈ కథలో హరిణి (జోవికా విజయ్ కుమార్) పాత్ర, బాబా (షిజు) కారెక్టర్ ఏంటి? అన్నదే కథ. ఇదీ చదవండి : ‘పీరియడ్స్‌ వస్తే నరకం.. నొప్పులు భరించలేక..: శ్రుతిహాసన్‌ సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) మార్కెట్లోకి ఐఫోన్‌ 18 ఎంట్రీ...స్టోర్స్‌ ముందు క్యూ కట్టిన ఫ్యాన్స్‌ (ఫొటోలు) బిగ్ బాస్ బ్యూటీ తనూజ ‘హతః’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు) ఖైరతాబాద్ మహా గణపతి...ట్యాంక్ బండ్‌పై సందడిగా నిమజ్జనం (ఫొటోలు) హైదరాబాద్ లో దారుణం.. జుట్టు పట్టుకుని మహిళను ఈడ్చుకెళ్లిన రైల్వే పోలీస్ సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసుల దెబ్బలకే మృతి.. సిట్ సంచలన రిపోర్ట్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కుమారుడి ఎంగేజ్మెంట్ కు YS జగన్ BIG DANGER: హైదరాబాద్ తాగునీటిలో విషం వాటర్ ఫిల్టర్లు కూడా కాపాడలేవు!

Original source: sakshi.com
Read more on Kaizer News