Kaizer News

‘గుడ్‌ బాయ్స్‌’ గ్రూప్‌కి లీడర్‌గా

‘గుడ్‌ బాయ్స్‌’ గ్రూప్‌కి లీడర్‌గా

· Entertainment · ntnews.com

వెన్నెల కిశోర్‌, శృతి సోధి, రవిరాజా, వైవా హర్ష ప్రధాన పాత్రలు పోషిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘గుడ్‌ బాయ్స్‌’. రాఘవ్‌ దర్శకుడు. సూర్య గుణ్ణం, వివేక్‌ ఇనంపూడి, నవ్య శశాంక్‌ కనకమేడల నిర్మాతలు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నది. శనివారం వెన్నెల కిశోర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని మేకర్స్‌ ఆనందం వెలిబుచ్చారు. ఇందులో వెన్నెలకిశోర్‌ క్రేజీ గ్యాంగ్‌ని లీడ్‌ చేసే లీడర్‌గా కనిపిస్తారని మోషన్‌ పోస్టర్‌ చెబుతున్నది. ైస్టెలిష్‌గా, గందరగోళంగా ఉన్న గ్యాంగ్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. వెన్నెల కిశోర్‌ కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని, స్నేహంతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రం ఇదని మేకర్స్‌ చెబుతున్నారు. వామ్సీ గౌడ్‌, గుండు సుదర్శన్‌, హైపర్‌ ఆది ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గౌతమ్‌ గోవిందరాజన్‌, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల

Original source: ntnews.com
Read more on Kaizer News