సైబరాబాద్ పోలీసులు ఫాస్టాగ్ ద్వారా ఈ-చలాన్ల ఆటో డెబిట్ ప్రణాళిక. పెండింగ్ చలాన్లు తగ్గించి, రహదారి భద్రత పెంపునకు ఈ ప్రణాళిక. జాయింట్ సీపీ ఈ ప్రతిపాదన చేశారు, అమలుకు సంప్రదింపులు సాగుతున్నాయి. Hyderabad E-Challan Fastag Link: హైదరాబాద్ వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బిగ్ అలర్ట్ ఇస్తున్నారు. రోడ్డుపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఇకపై కేవలం ఫోన్‌కు వచ్చే చలాన్ మెసేజ్ చేయడం కాదు. మీరు సిగ్నల్ జంప్ చేసినా, లిమిట్‌కు మించి స్పీడ్ వెళ్లినా, పార్కింగ్ స్థలంలో వాహనాన్ని నిలిపి ఉంచినా మీ ఫాస్టాగ్ నుంచి జరిమానా సొమ్ము ఆటోమేటిక్‌గా కట్ కాబోతోంది. దీన్ని త్వరలోనే అమలు చేయడానికి సైబరాబాద్‌ట్రాఫిక్ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. నగరంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాల రద్దీ, బాధ్యతారహితమైన డ్రైవింగ్,భారీగా పేరుకుపోతున్న ఈ-చలాన్ బకాయిలకు పరిష్కారం చూపేందుకు సైబరాబాద్ పోలీసులు ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నారు. టెక్నాలజీని వినియోగించుకొని రోడ్డు భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా ఈ ఫాస్టాగ్ చలాన్ ఆటో డెబిట్ విధానంపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో పోలీసులు విస్తృత సంప్రదింపులు జరుపుతున్నారు. అనుమతులు లభించిన వెంటనే ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ నిర్వహించిన 20వ వార్షికోత్సవ సదస్సులో ఈ సంచలన ప్రతిపాదన చేశారు. రహదారి భద్రత- సాంకేతికత, పౌరుల భాగస్వామ్యం అనే అంశంపై జరిగిన ప్రత్యేక చర్చా వేదికలో సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సున్ప్రీత్ సింగ్ దీనికి సంబంధించిన వివరాలు అందజేశారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిష్ టెక్నాలజీ ఆధారంగా ఉల్లంఘనలను గుర్తించి ఆటోమేటిక్ ఈ చలాన్లు జారీ చేస్తున్నారు. కానీ చాలా మంది వాహనదారులు ఈ చలాన్లను సకాలంలో చెల్లించడం లేదు. ప్రభుత్వం ఎప్పుడైనా డిస్కౌంట్ లేదా రాయితీ ఇస్తేనే కడదాం అనే ధోరణిలో బకాయిలను సంవత్సరాల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వాహనదారుల బ్యాంక్ అకౌంట్ లేదా ఫాస్టాగ్ వాలెట్‌తో అనుసంధానించాలని జాయింట్ సీపీ ప్రతిపాదించారు. "కేవలం జరిమానాలు వేయడమే సమస్యకు పరిష్కారం కాదు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించిడంతోపాటు ప్రతి ఒక్కరిలో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం అత్యవసరం . రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు. ప్రభుత్వం విభాగాలు, టెక్నాలజీ నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, పౌరులు భాగమైతే సురక్షిత నగరాన్ని నిర్మించుకోవచ్చు" ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా ఉపయోగించుకోవాలంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీని పటిష్టం చేయాలి. మెట్రో స్టేషన్లు, ప్రధాన బస్‌స్టాండ్ల నుంచి కాలనీలు, గమ్యస్థానాలకు చేరడానికి వీలుగా ఫీడర్ బస్‌లు, షటిల్ సర్వీస్‌లు, ఎలక్ట్రిక్ రిక్రూట్‌మెంట్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. నగరంలోని వ్యాపార కూడళ్ళు, ఐటీ కారిడార్లలో ప్రధాన సమస్యగా మారిన అడ్డదిడ్డ పార్కింగ్‌ను అడ్డుకోవడానికి