ZenC Labs : హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ప్రొటోటైపింగ్ స్పేస్ T-Works శనివారం ఒక అద్భుతమైన సాంకేతిక విప్లవానికి వేదికగా మారింది. వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ ప్రపంచంలో సైబర్ బెదిరింపులకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ విభాగాల్లో నూతన పరిశోధనలు సాధించేందుకు రూపొందించిన 'ZenC Labs' సంస్థ ప్రారంభోత్సవ వేడుక అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ వేడుకకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, నేటి ఆధునిక డిజిటల్ యుగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు సైబర్ నేరాలు, డేటా లీకేజీ బెదిరింపులు కూడా పెను సవాలుగా మారుతున్నాయని గుర్తుచేశారు. ఇలాంటి సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కోవడంలో కృత్రిమ మేధస్సు (AI) , అడ్వాన్స్‌డ్ సైబర్ సెక్యూరిటీ సాంకేతికతలు రక్షణ కవచంలా పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచపటంలో తిరుగులేని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో 'ZenC Labs' వంటి వినూత్న, పరిశోధనాత్మక స్టార్టప్‌లు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అత్యంత అధునాతన ప్రమాణాలతో 'ZenC Labs'ను సమాజానికి పరిచయం చేసిన సంస్థ ఫౌండర్ & సీఈఓ రవి పుత్తాని, అలాగే వారి సాంకేతిక బృందాన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. గ్లోబల్ స్థాయిలో వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా వినూత్న పరిష్కారాలను అందిస్తూ, ఈ సంస్థ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు. సాంకేతిక నిపుణుల సమక్షంలో జరిగిన ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో 'ZenC Labs' చీఫ్ మెంటార్ మురళి తలసిల, అరబిందో ఫార్మా గ్రూప్ సీఐఓ (CIO) చిట్టి బాబు, వాల్యూమోమెంటమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భరత్ అయ్యంగార్లతో పాటు ఐటీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు, సైబర్ భద్రతా నిపుణులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. సైబర్ సెక్యూరిటీ రంగంలో 'ZenC Labs' ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువస్తుందని ఈ సందర్భంగా హాజరైన ప్రతినిధులు ఆకాంక్షించారు. అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది