హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పండుగ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను, చేనేత కార్మికులను ఆదుకోవాలనే సామాజిక బాధ్యత జోడించి తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) లండన్‌లో ‘టాక్ చేనేత బతుకమ్మ–దసరా 2026’ నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆవిష్కరించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్‌పర్సన్ మంత్రి శ్రీదేవి, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, లండన్ ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ఇది ఒక విశిష్టమైన ప్రతిరూపమని అన్నారు. తెలంగాణ సంస్కృతి, పండుగలు, కళలు, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంలో ప్రవాస తెలంగాణ ప్రజలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా టాక్ సంస్థ చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ, సామాజిక బాధ్యతతో బతుకమ్మ పండుగను “టాక్ – చేనేత బతుకమ్మ”గా నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమని దేశపతి శ్రీనివాస్ అన్నారు. చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, తెలంగాణ కళాకారుల తరతరాల నైపుణ్యానికి, శ్రమకు, మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను చేనేతతో అనుసంధానం చేస్తూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా చేనేత కళాకారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు, తెలంగాణ చేనేత ప్రత్యేకతను, మన సంస్కృతి గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై మరింత విస్తృతంగా చాటిచెప్పే అవకాశం ఏర్పడుతుందని అన్నారు. ప్రవాస తెలంగాణ సమాజం ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తెలంగాణ సంస్కృతి, భాష, కళలు, సంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తూ వాటి పరిరక్షణకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని దేశపతి శ్రీనివాస్ తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ, మన సంస్కృతి పట్ల గర్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పడం అభినందించదగ్గ విషయమన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పండుగలకు ప్రత్యేక గౌరవం లభించిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం బతుకమ్మ, బోనాలు వంటి తెలంగాణ పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపునిస్తూ, వాటి వైభవాన్ని మరింతగా చాటిచెప్పేలా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగకు అధికారిక రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు మరింత గౌరవం, గుర్తింపు లభించిందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి అనిల్ కూర్మాచలం, ఆయన బృందం లండన్ వేదికగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో నిరంతరం చేస్తున్న కృషిని దేశపతి శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ సంస్కృతి పరిరక్షణ, చేనేత కార్మికుల ప్రోత్సాహం, బతుకమ్మ పండుగను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడంలో టాక్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్