Kaizer News

సెప్టెంబర్ 25న ‘ప్రేమనే ఊరిలో’ విడుదల.. సోల్‌ఫుల్

సెప్టెంబర్ 25న ‘ప్రేమనే ఊరిలో’ విడుదల.. సోల్‌ఫుల్ లవ్‌స్టోరీగా సినిమా

· Entertainment · v6velugu.com

శ్రీరామ్, రమికా శివు, తపస్విని పూనాచ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మనోజ్ కుమార్ దర్శకత్వంలో చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర కలిసి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా, శుక్రవారం నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌‌కు అతిథిగా హాజరైన కామాక్షి భాస్కర్ల ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరింది. హీరో శ్రీరామ్ మాట్లాడుతూ ‘ఇదొక సోల్‌‌ఫుల్, ఎమోషనల్, మ్యూజికల్ లవ్ స్టోరీ. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పాడు. ఇదొక ఫీల్ గుడ్ మూవీ అని, ఈ చిత్రంతో టాలీవుడ్‌‌కు పరిచయం అవడం ఆనందంగా ఉందని హీరోయిన్స్ తపస్విని, రమిక చెప్పారు. ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామని నిర్మాతలు చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు

Original source: v6velugu.com
Read more on Kaizer News