Kaizer News

House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!

· Business · ntvtelugu.com

House Construction Cost: సొంత ఇల్లు కట్టుకోవడం ప్రతీ ఒక్కరి డ్రీమ్. అయితే ప్లాట్ చేతికి రాగానే మనసులో మెదిలే మొదటి ప్రశ్న... "అసలు ఇల్లు పూర్తి కావడానికి ఎంత ఖర్చవుతుంది?" చాలామంది ఈ బడ్జెట్ అంచనాలోనే పప్పులో కాలేస్తారు. మొదట్లో అంతా బడ్జెట్‌లోనే అయిపోతుందని ధీమాగా ఉన్నా, పని ముందుకు సాగుతున్న కొద్దీ జేబుకు కన్నం పడుతూనే ఉంటుంది. కానీ రూపాయి రూపాయి లెక్కించాల్సిన అవసరం లేకుండా, కేవలం ఐదే ఐదు నిమిషాల్లో ఒక రఫ్ బడ్జెట్ అంచనా వేసుకోవడానికి ఒక సులువైన మార్గం ఉంది. దీనికోసం మీరు పెద్ద పెద్ద లెక్కలు చేయక్కర్లేదు. మీ ఇంటి 'బిల్ట్-అప్ ఏరియా' ఎంత, మీ ప్రాంతంలో ప్రసుతం చదరపు అడుగుకి నిర్మాణ ఖర్చు ఎంత ఉందో తెలిస్తే చాలు. జేకే సిమెంట్, ఆల్ట్రాటెక్ వంటి ప్రముఖ సిమెంట్ సంస్థలు తమ ఆన్‌లైన్ 'కన్స్ట్రక్షన్ కాస్ట్ కాలిక్యులేటర్ల'లో వాడే లాజిక్ కూడా ఇదే

Original source: ntvtelugu.com
Read more on Kaizer News