కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనాలకు నో.. చెరువు పరిరక్షణే లక్ష్యం.. నిమజ్జనాలకు ప్రత్యామ్నాయం చిన్న విగ్రహాల కోసం బేబీ పాండ్… జీవవైవిధ్య పరిరక్షణ అందరి బాధ్యత.. కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్, ఆంధ్రప్రభ : నగర జీవవైవిధ్యానికి కీలకమైన కాప్రా చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి వెసులుబాటు లేదని హైడ్రా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అర్బన్ వెట్‌ల్యాండ్‌గా గుర్తించిన ఈ చెరువులో నిమజ్జనాల వల్ల పర్యావరణానికి, జీవవైవిధ్యానికి నష్టం కలిగే అవకాశం ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. చిన్న విగ్రహాల నిమజ్జనానికి చెరువు సమీపంలోని బేబీ పాండ్‌ను వినియోగించుకోవాలని సూచించారు. -కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనాలకు వెసులుబాటు లేదు -చిన్న విగ్రహాల నిమజ్జనానికి బేబీ పాండ్‌ను వాడుకుందాం -అర్బన్ వెట్‌ల్యాండ్ జాబితాలో కాప్రాచెరువుందన్న హైడ్రా కమిషనర్ -జీవవైవిద్యం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత మనదే అంటూ హితవు 🔷జీవ వైవిద్యానికి ప్రతీకగా చ… pic.twitter.com/dE8wV1xNE7 కాప్రా చెరువు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వచ్చిన కమిషనర్.. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, స్థానిక ప్రతినిధులతో ఈ అంశంపై మాట్లాడారు. గణేష్ నిమజ్జన సంప్రదాయాన్ని గౌరవిస్తూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఉత్సవ కమిటీ ప్రతినిధులకు సూచించారు. కాప్రా చెరువు కేవలం సాధారణ నీటి వనరు కాదని, నగర పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తున్న వెట్‌ల్యాండ్ అని రంగనాథ్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, యూరప్‌తో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే 470కుపైగా వలస పక్షులకు ఈ చెరువు ఆవాసంగా ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో చెరువు సహజ స్వరూపాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అర్బన్ వెట్‌ల్యాండ్‌ల జాబితాలో కాప్రా చెరువుకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. మంజీరా వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, పాఖల్ సరస్సు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కూడా ఈ జాబితాలో ఉన్నాయని గుర్తుచేశారు. దాదాపు 113 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాప్రా చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. వరద నీటి నిల్వ, భూగర్భ జలాల పునరుద్ధరణ, జీవవైవిధ్య పరిరక్షణ, పక్షుల ఆవాసాల సంరక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. చెరువు పరిధిలో సుమారు 70 శాతం వరకు ప్రైవేటు పట్టా భూములు ఉన్నప్పటికీ, భూయజమానులు చెరువు అభివృద్ధికి సహకరించడం అభినందనీయమన్నారు. కాప్రా లేక్ రివైవల్ గ్రూప్ ప్రతినిధులు కూడా కమిషనర్‌ను కలిసి చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ సందర్భంగా చెరువుకు వచ్చే వలస పక్షుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను రంగనాథ్ తిలకించారు. వెట్‌ల్యాండ్‌ల పరిరక్షణ నిబంధనల ప్రకారం చెరువు హద్దులను కాపాడటం, ఆక్రమణలను అడ్డుకోవడం, కాలుష్యం నుంచి రక్షించడం అత్యంత ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్యాలకు విఘాతం కలగకుండా ప్రజలు, ఉత్సవ కమిటీలు సహకరించాలని విజ్ఞప్తి