Kaizer News

Vanasthalipuram: వృద్ధుడిపై కత్తితో దాడి.. పరారైన

Vanasthalipuram: వృద్ధుడిపై కత్తితో దాడి.. పరారైన నిందితుడు అరెస్ట్!

· City - Hyderabad · hmtvlive.com

Shorts Vanasthalipuram: ఎన్‌జీఓ కాలనీలో 72 ఏళ్ల వృద్ధుడిపై కత్తితో దాడి చేసి పరారైన నిందితుడిని వనస్థలిపురం పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. దంగేటి భుజంగరావు (72), S/o వెంకట్‌రెడ్డి పై ఈ నెల 18న ఎన్‌జీఓ కాలనీ వద్ద ఠాకూర్ శివేందర్ సింగ్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. దీనిపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 19 ఉదయం ఇంజాపూర్ వద్ద పరారవుతుండగా శివేందర్ సింగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించారు. విచారణ అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించగా, చర్లపల్లి జైలుకు పంపినట్లు వనస్థలిపురం పోలీసులు వెల్లడించారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News