Kaizer News

18,600 అడుగుల ఎత్తులో డేరింగ్‌ ఆపరేషన్‌

18,600 అడుగుల ఎత్తులో డేరింగ్‌ ఆపరేషన్‌

· National - India · ntnews.com

రోగిని కాపాడిన ఆర్మీ న్యూఢిల్లీ, ఆగస్టు 30: లద్దాఖ్‌లోని నన్‌ కున్‌ పర్వత శ్రేణి సమీపంలో భారత సైనికులు చేపట్టిన అత్యంత సాహసోపేతమైన ‘హై-ఆల్టిట్యూడ్‌’ రెస్క్యూ ఆపరేషన్‌ విజయవంతమైంది. సుమారు 18,600 అడుగుల ఎత్తులో నిటారుగా ఉన్న కొండవాలు నుంచి ఓ రోగిని సైనిక సిబ్బంది సురక్షితంగా తరలించారు. అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో నిర్వహించిన ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ఫొటోలను, వీడియోను భారత సైన్యానికి చెందిన ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ కోర్‌ సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. ఈ రెస్క్యూ మిషన్‌కు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆ ప్రాంతంలో గాలులు తీవ్రంగా వీయడంతోపాటు, సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల గాలి సాంద్రత తక్కువ. దీంతో హెలికాప్టర్‌ ఇంజిన్‌ పనితీరు, రోటర్‌ లిఫ్ట్‌, బరువును మోసే సామర్థ్యం తగ్గే పరిస్థితి ఏర్పడింది. రోగి ఉన్న ప్రదేశంలో హెలికాప్టర్‌ను పూర్తిగా ల్యాండ్‌ చేయడానికి సరైన స్థలం లేదు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనావేసి, హెలికాప్టర్‌ బరువును తగ్గించే చర్యలు చేపట్టింది. రోగి వద్దకు చేరుకున్న తర్వాత పూర్తిస్థాయిలో ల్యాండింగ్‌ అవసరం లేకుండానే గ్రౌండ్‌ టీమ్‌ రోగిని హెలికాప్టర్‌లోకి తరలించింది. తాజా రెస్క్యూ ఆపరేషన్‌ భారత సైనికుల అసాధారణ నైపుణ్యం, ధైర్యసాహసాలను మరోసారి ప్రపంచానికి చాటింది

Original source: ntnews.com
Read more on Kaizer News