Kaizer News

రోదసిలోకి ‘రోమన్‌ టెలిస్కోప్‌’

రోదసిలోకి ‘రోమన్‌ టెలిస్కోప్‌’

· National - India · ntnews.com

విశ్వ రహస్యాల కోసం ‘నాసా’ ప్రయోగం ఫ్లోరిడా, ఆగస్టు 30: కొత్త గ్రహాల అన్వేషణ, విశ్వ రహస్యాలను ఛేదించడానికి నాసా శక్తివంతమైన ‘నాన్సీ గ్రేస్‌ రోమన్‌ స్పేస్‌ టెలిస్కోప్‌’ను అంతరిక్షంలోకి పంపింది. దీనిని ఆదివారం ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి ‘స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌’ భారీ రాకెట్‌ ద్వారా విజయవంతంగా ప్రయోగించారు. ప్రస్తుతం ఇది భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండవ లాగ్రాంజ్‌ పాయింట్‌ (ఎల్‌2) వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. రోదసిలో భూమి చుట్టూ పరిభ్రమించే శాటిలైట్‌లా కాకుండా, ఈ టెలిస్కోప్‌ సూర్యుడు-భూమికి మధ్య ఉన్న ఎల్‌2 ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. సుమారుగా ఒక నెల రోజుల తర్వాత ఈ టెలిస్కోప్‌ ఎల్‌2 ప్రాంతానికి చేరుకోనున్నది. హబుల్‌ టెలిస్కోప్‌ కంటే 100 రెట్లు ఎక్కువగా రోమన్‌ టెలిస్కోప్‌ చాలా వేగంగా ఆకాశాన్ని పరిశీలించగలదు. డార్క్‌ ఎనర్జీ, డార్క్‌ మ్యాటర్‌ రహస్యాలను పరిశోధించనున్నది. అంతేగాక బిలియన్ల కొద్దీ గెలాక్సీలను చిత్రాలు తీసి మ్యాప్‌ చేస్తుంది

Original source: ntnews.com
Read more on Kaizer News