భాగవత్ ‘భిన్నత్వంలో ఏకత్వం’ వ్యాఖ్యలపై కపిల్ సిబల్ విమర్శలు న్యూఢిల్లీ: అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ న్యూయార్క్ మేడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో చేసిన ప్రసంగంపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్‌లో ముస్లింలు ఉండకూడదు అని భావించే వాళ్లు అసలు హిందువులే కాదు అంటూ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై సిబల్ విమర్శలు గుప్పించారు. మోహన్ భాగవత్‌కు విదేశాల్లో ఉన్నప్పుడే భిన్నత్వంలో ఏకత్వ భావన గుర్తుకొస్తుందా? అని ఎద్దేవా చేశారు. ‘‘భాగవత్ చేసిన ప్రసంగం వింటుంటే అసలు అది రాహుల్ గాంధీ ప్రసంగమా లేదంటే నిజంగానే భాగవత్ మాట్లాడారా? అనే అనుమానమొ చ్చింది. అచ్చం రాహుల్‌గాం«దీలా మాట్లాడారు’’ అని సిబల్ వ్యంగ్య వ్యాఖ్యచేశారు. ‘‘భాగవత్ భారత్‌లో ఉన్నప్పుడు హిందువుగా ఉన్నందుకు గర్వించాలని తెగ ప్రసంగిస్తారు. తీరా అమెరికా వంటి విదేశాలకు వెళ్లినప్పుడు హఠాత్తుగా భిన్నత్వంలో ఏకత్వ భావనను గుర్తుకొస్తుంది. విదేశీ గడ్డపై కాలుమోపినప్పుడు మాత్రమే భిన్నత్వంలో ఏకత్వంపై ప్రసంగాలు దంచికొడుతున్నారు. ఇదే ఆయన హిందుత్వ నిజ స్వరూపం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి భిన్నత్వం కోసం పెద్ద పోరాటమే జరుగుతోంది. మీరు ప్రజలను స్వేచ్ఛగా బతకనివ్వరు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకారులపై ప్రభుత్వం దమనకాండకు పాల్పడితే ఒక్కమాటైనా మాట్లాడారా?’’ అని సిబల్ సూటి ప్రశ్నవేశారు. కాంగ్రెస్, టీఎంసీలు సైతం భాగవత్ వ్యాఖ్యలపై స్పందించాయి. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఇలాంటి మాటలను ముందుగా హిందూముస్లిం విద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీ నేతలకు చెప్పాలని సూచించాయి. భాగవత్ అబద్ధాలు చెప్పడం మానేయాలని, ఆర్‌ఎస్‌ఎస్ డీఎన్‌ఏ నిండా ఉన్నది విద్వేషం, మతవాదమేనంటూ దుమ్మెత్తిపోశాయి. హీరోయిన్ ఇంట్లో సందడిగా వరలక్ష‍్మి వ్రతం (ఫొటోలు) చిన్నోడే కానీ బలం చూస్తే షాకే.. పంటితో 3.5 టన్నుల బస్సు లాగాడు మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు