ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: మిస్సింగ్ మేఘన టైటిల్ లో ఉన్నట్లుగానే.. ఓ అమ్మాయి మిస్సింగ్, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ సాగే కథ. సస్పెన్స్ కథలు చాలానే చూసినప్పుడు.. కొత్తగా ఏం చూపిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ‘మిస్సింగ్ మేఘన’ కూడా అలాంటి సస్పెన్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే. అయితే సాధారణంగా కనిపించే కథకు ‘డ్రాప్ మీ’ అనే నేపథ్యాన్ని జోడించి.. భిన్నమైన భావోద్వేగాలతో కథను నడిపించే ప్రయత్నం చేశారు. మేఘన (అమ్ము అభిరామి) అనే యువతి ఒకరోజు హఠాత్తుగా అదృశ్యమవుతుంది. అసలు మేఘన ఎలా మాయమైంది? ఆమె అదృశ్యానికి వెనుక ఉన్న కారణాలు ఏంటి? ఈ కేసుకు ఆమె తండ్రి శ్రీనివాసరావు (గోపరాజు రమణ), కాబోయే భర్త ఏసీపీ అర్జున్ (కౌశిక్), బైక్ రైడర్ కార్తీక్ (రామ్ కార్తీక్), ఆద్య (వైదిక సెంజలియా)లకు ఉన్న సంబంధం ఏంటి? అసలు మేఘన ఏం చేస్తుంటుంది? ఈ కథలో ఆకాష్ (అంకిత్ కొయ్య) పాత్ర ఏంటి? ఇన్వెస్టిగేషన్‌లో బయటపడిన సంచలన నిజాలు ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాల మిశ్రమమే మిస్సింగ్ మేఘన. కథలో ట్విస్టులకు పెద్దపీట వేస్తూ రచయిత కథను అల్లిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కథనం వేగం పుంజుకుని ప్రేక్షకులను పరుగులు పెట్టించేలా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం కథ పరిధిలోనే నెమ్మదిగా ముందుకు వెళ్తుంది. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని మలుపులు ఆసక్తిని పెంచుతాయి. అయితే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సినిమాలకు కథతో పాటు లొకేషన్స్, సినిమాటిక్ ట్రీట్‌మెంట్, మేకింగ్ కూడా చాలా కీలకం. ‘మిస్సింగ్ మేఘన’లో ఆ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా ప్రభావం ఇంకాస్త పెరిగేది. కథ, కథనంలో ఉన్న బలానికి తగ్గట్టుగా దర్శకుడు ట్రీట్‌మెంట్ ఇవ్వలేకపోయారనే భావన కొన్ని చోట్ల కలుగుతుంది. మంచి పాయింట్ ఉన్నప్పటికీ దాన్ని తెరపై మరింత బలంగా చూపించాల్సిన అవసరం కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు పూర్తిగా ఎడిట్ చేసినట్టు, కథలో కొన్ని లింకులు మిస్ అయినట్టు అనిపిస్తాయి. దీంతో కథనం మధ్యలో కొంత అసంతృప్తి కలుగుతుంది. నిర్మాణ విలువల విషయానికి వస్తే.. ఉన్న బడ్జెట్ పరిధిలో వీలైనంత మంచి అవుట్‌పుట్ ఇవ్వాలనే ప్రయత్నం కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల బడ్జెట్ పరిమితులు తెరపై కనిపించినట్లు అనిపిస్తాయి. లొకేషన్స్, మేకింగ్ విషయంలో ఇంకాస్త గ్రాండ్‌గా ఉంటే సినిమా ఇంపాక్ట్ మరింత పెరిగేది. ‘మిస్సింగ్ మెగానా’లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కథా పాయింట్‌లోని కొత్తదనం, ట్విస్టులతో కూడిన రైటింగ్. కథను మరింత పకడ్బందీగా ఎగ్జిక్యూట్ చేసి, దర్శకత్వంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే మంచి క్రైమ్ థ్రిల్లర్‌గా నిలిచే అవకాశం ఉండేది. దర్శకుడు వాచస్పతి ఎంచుకున్న కథ బాగున్నా.. దాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం ఓ మోస్తరుగా ఆకట్టుకుంటుంది. కథలో కొన్ని ట్విస్టులు ముందుగానే ఊహించే అవకాశం ఉండటం, అక్కడక్కడా నెమ్మదిగా సాగే సన్నివేశాలు సినిమాకు కాస్త ప్రతికూలంగా మారాయి. ముఖ్యంగా ప్రతినాయకుడి చుట్టూ ఉన్న అంశాలు ముందే అర్థమయ్యే అవకాశం ఉండటం, కొన్ని సన్నివేశాలు అవసరానికి మించి సాగడం సినిమాకు వేగాన్ని తగ్గించాయి. అయినప్పటికీ