Kaizer News

HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.

HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు

· Technology · ntvtelugu.com

పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు 105 4G School Edition వచ్చేసింది వెబ్ బ్రౌజర్ లేదు, పేరెంటల్ కంట్రోల్ ఉంది Follow Us : --> Add as a preferred source on google HMD 105 4G School Edition: పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువగా అలవాటు పడకుండా, అదే సమయంలో తల్లిదండ్రులతో అవసరమైన సమయంలో కనెక్ట్ అయి ఉండేలా HMD కొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. అదే HMD 105 4G School Edition. పేరుకు తగ్గట్టుగానే ఈ ఫోన్‌ను ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే సోషల్ మీడియా, వెబ్ బ్రౌజింగ్ వంటి దృష్టి మరల్చే అంశాలకు దూరంగా ఉంచేలా ఇందులో పలు పరిమితులను అందించారు. వెబ్ బ్రౌజర్ లేకపోవడం, పేరెంటల్ కంట్రోల్, 4G కనెక్టివిటీ, రిమూవబుల్ బ్యాటరీ, IP54 రేటింగ్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. HMD 105 4G School Editionను కంపెనీ గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ ధరను HMD అధికారికంగా వెల్లడించలేదు. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ను లిస్ట్ చేసింది. ఇది ప్రస్తుతం Cyan కలర్ ఆప్షన్‌లో కనిపిస్తోంది. ఈ ఫోన్‌ను పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. స్మార్ట్‌ఫోన్‌లో ఉండే అనేక ఎంటర్ టైన్ మెంట్, సోషల్ మీడియా ఫీచర్లు పిల్లల చదువుపై దృష్టిని ప్రభావితం చేయకుండా ఉండేలా HMD 105 4G School Editionను సాధారణ ఫీచర్ ఫోన్‌గా రూపొందించింది. ఫోన్‌లో కాలింగ్, టెక్స్టింగ్ వంటి ప్రాథమిక కమ్యూనికేషన్ సదుపాయాలు ఉన్నాయి. అయితే వెబ్ బ్రౌజర్‌ను పూర్తిగా తొలగించారు. అలాగే పిల్లల కోసం అందుబాటులో ఉన్న ఏకైక ఎంటర్ టైన్ మెంట్ ఫీచర్‌గా Snake గేమ్ ఉంది. ఈ ఫోన్‌లో తల్లిదండ్రులకు ఉపయోగపడే Parental Controls అందించారు. వీటిని PINతో సురక్షితంగా ఉంచవచ్చు. తల్లిదండ్రులు అవసరాన్ని బట్టి Bluetooth, MMS, FM Radio వంటి ఫీచర్లను డిసేబుల్ చేయవచ్చు. దీంతో పిల్లలు ఫోన్‌ను కేవలం అవసరమైన కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగించేలా తల్లిదండ్రులు నియంత్రించుకోవచ్చు. పిల్లల కోసం ఫోన్‌ను మరింత పరిమితంగా ఉంచే క్రమంలో ఇందులో రికార్డింగ్ ఫంక్షన్‌ను కూడా అందించలేదు. అంటే సాధారణ ఫీచర్ ఫోన్లలో కనిపించే కొన్ని అదనపు ఫీచర్లను తొలగించి, కాల్స్, మెసేజ్‌లకు ప్రాధాన్యత ఇచ్చారు. HMD 105 4G School Editionలో 2.4-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది 240×320 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో Nano-SIM సపోర్ట్ ఉంటుంది. ఫోన్‌లో 64MB RAM, 128MB ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు. అంతేకాకుండా microSD కార్డ్ ద్వారా 32GB వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే HMD 105 4G School Editionలో 1,450mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని అవసరమైనప్పుడు తొలగించుకునే అవకాశం ఉండటం ప్రత్యేకత. కంపెనీ ప్రకారం, ఈ ఫోన్ స్టాండ్‌బైలో 15 రోజుల వరకు పనిచేస్తుంది. ఫోన్‌లో సుమారు 2,000 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకునే సామర్థ్యం ఉంది. బడ్జెట్ ఫీచర్ ఫోన్ అయినప్పటికీ కనెక్టివిటీ విషయంలో HMD కొన్ని ఆధునిక ఆప్షన్లను అందించింది. ఇందులో 2G, 3G, 4G, Bluetooth 5.0, USB-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

Original source: ntvtelugu.com
Read more on Kaizer News