Kaizer News

ఏథర్‌ కోణార్క్‌ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.99,999

ఏథర్‌ కోణార్క్‌ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.99,999

· Business · ntnews.com

న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్‌..దేశీయ మార్కెట్‌కు సరికొత్త మాడల్‌ను పరిచయం చేసింది. కోణార్క్‌ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్‌ ప్రారంభ ధర రూ.99,999గా నిర్ణయించింది. సింగిల్‌ చార్జింగ్‌తో 100 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. అలాగే సింగిల్‌ చార్జింగ్‌తో 125 కిలోమీటర్లు ప్రయాణించే మాడల్‌ను రూ.1,21,999కి, దీంతోపాటు 161 కిలోమీటర్లు ప్రయాణించే స్కూటర్‌ ధర రూ.1,44,999గా నిర్ణయించింది. కానీ సింగిల్‌ చార్జింగ్‌తో 200 కిలోమీటర్లు ప్రయాణించే మాడల్‌ ధరను ప్రస్తుతానికి ప్రకటించలేదు. వీటిలో ఎస్‌ వెర్షన్‌, ఆర్‌ వెర్షన్‌ మాడళ్లు వచ్చే నెల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్‌ అవుట్‌లెట్లలో లభించనున్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News