జీవిత బీమా సంస్థ ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సమగ్ర బీమా రక్షణ కల్పించే దిశగా గోల్డ్ టర్మ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రీమియం వాపసు వచ్చే లైఫ్ కవరేజీని కూడా ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. పాలసీదారు మరణించిన పక్షంలో జీవిత భాగస్వామికి అదనపు లైఫ్ కవరేజీ వర్తించేలా సోల్‌మేట్ బెనిఫిట్, నిర్దిష్ట వ్యవధిలోపల పాలసీని నిలిపివేస్తే అప్పటివరకు చెల్లించిన 100 శాతం ప్రీమియంలు వెనక్కి వచ్చేలా స్మార్ట్ ఎగ్జిట్ ఫీచరు ఉంది. పాలసీదారులకు ఏటా దాదాపు రూ. 75,000 విలువ చేసే హెల్త్ చెకప్‌లు, స్పెషలిస్ట్ కన్సల్టేషన్ తదితర హెల్త్ మేనేజ్‌మెంట్ సరీ్వసులు లభిస్తాయి. మహిళా కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. వచ్చే 12 నెలల్లో ఈ ప్లాన్‌తో తమ టర్మ్ ఇన్సూరెన్స్ వ్యాపారం రెట్టింపు అవుతుందని భావిస్తున్నట్లు సంస్థ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ సుమీత్ సాహ్ని తెలిపారు. మెట్రోలు, ప్రథమ..ద్వితీయ శ్రేణి నగరాల్లోని కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ పాలసీకి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు తదితర మార్కెట్లలో డిమాండ్ ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వెలిగొండకు జగన్ అప్పుడే.. క్రెడిట్ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ! Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05) కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు) ఢిల్లీలో నిర్భయ తరహాలో ఘటన.. స్లీపర్ బస్సులో బాలికపై.. 5 లక్షలకు 36 వేల వడ్డీ! పోస్టాఫీస్ లో అదిరిపోయే స్కీమ్ లైవ్ లో మల్లెపూల పల్లకి పాటతో పూనకాలు తెప్పించిన ఇరుముడి సింగర్ డప్పు శీను నేనే ధీరుడిని.. పోటుగాడిని అనుకున్నాడు.. YSRCP నుండి బయటకు వెళ్ళాక సీన్ అర్థమైంది