Kaizer News

Kadthal: కడ్తాల్‌లో మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ నాయక

Kadthal: కడ్తాల్‌లో మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ నాయకుల పరామర్శ!

· City - Hyderabad · hmtvlive.com

Kadthal: కడ్తాల్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన కాశమోని జంగయ్య, డేరంగుల రాములు కుటుంబాలను సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసింహా రెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కంబాల పరమేష్ మరియు పలువురు బిఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు గంపా వెంకటేష్ గుప్తా ఇరువురు కుటుంబాలకు 5,000/- చొప్పున 10,000/- రూపాయలు, మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి 5,000/- చొప్పున 10,000/- రూపాయలు మొత్తం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ ఎవరికి ఏ ఆపద వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని తెలిపారు. పదవులు ఉన్నా, లేకున్నా ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామకృష్ణ, మంగలపల్లి నర్సింహ, లయక్ అలీ, కేశని బుచ్చయ్య,గురిగళ్ల రామచంద్రయ్య,మూఢ బాలరాజ్,మూఢ అశోక్,కేశని మహేష్,బోసు వెంకటేష్,సిద్దిగారి వెంకటేష్,అంజి కంబలపల్లి, రమేష్, రాయికంటి సురేష్, రాజు,రాఘవ,శ్రీకాంత్,సాయి తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News