Kaizer News

అనుకున్న సమయానికి కష్టమేనా?

అనుకున్న సమయానికి కష్టమేనా?

· Entertainment · ntnews.com

ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ వార్‌ డ్రామా ‘ఫౌజీ’ చిత్రాన్ని డిసెంబర్‌ 3న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా పరిణామాలను గమనిస్తే ఈ ఏడాది ‘ఫౌజీ’ విడుదల అసాధ్యమనే టాక్‌ వినిపిస్తున్నది. బ్యాలెన్స్‌గా ఉన్న వర్క్‌ కారణంగా ఈ సినిమా డిసెంబర్‌ బరి నుంచి తప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన రెండు భారీ యాక్షన్‌ ఘట్టాలను తెరకెక్కించాల్సి ఉంది. వీటికి 40రోజుల కాల్‌షీట్లు అవసరమని చెబుతున్నారు. దీనితో పాటు కొంత ప్యాచ్‌ వర్క్‌ కూడా మిగిలి ఉండటంతో మొత్తంగా 50రోజులకుపైగా షూటింగ్‌ అవసరం ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 3న ‘ఫౌజీ’ రిలీజ్‌ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అయితే ఇవి కేవలం ఊహాగానాలేనని, ముందస్తు ప్రకటించిన తేదీనే సినిమా విడుదలవుతుందని ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. ఈ విషయంలో స్పష్టత రావాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇమాన్వి, మిథున్‌చక్రవర్తి, అనుపమ్‌ఖేర్‌, జయప్రద, భానుచందర్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌చంద్రశేఖర్‌, నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, భూషణ్‌ కుమార్‌, రచన-దర్శకత్వం: హను రాఘవపూడి

Original source: ntnews.com
Read more on Kaizer News