Kaizer News

HYDRA News: లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు

HYDRA News: లిఫ్ట్‌లో ఇరుక్కున్న వ్య‌క్తి ప్రాణాలు కాపాడిన హైడ్రా, మూసాపేట‌లో గంటన్నర పాటు రెస్క్యూ ఆపరేషన్

· City - Hyderabad · telugu.abplive.com

మూసాపేటలో లోపభూయిష్ట లిఫ్ట్‌లో కాలు ఇరుక్కున్న మురళి. ఆదివారం ఉదయం 9:15కు సమాచారం; హైడ్రా బృందం చేరుకుంది. గోడ బద్దలుకొట్టి, హైడ్రాలిక్ కట్టర్‌తో మురళిని బయటికి తీశారు. మురళి కాలు ఫ్రాక్చర్ అయింది, ఆసుపత్రికి తరలించారు. Hyderabad News | హైద‌రాబాద్: హైడ్రా ఆదివారం నాడు ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడింది. లిఫ్టునకు - గోడ‌కు మ‌ధ్య ఇరుక్కుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్య‌క్తిని హైడ్రా సిబ్బంది క్షేమంగా బయటకు తీశారు. మూసాపేట‌, ఆంజ‌నేయ‌న‌గ‌ర్‌లోని 3 అంత‌స్తుల భ‌వ‌నంలో గ్రిల్స్‌తో ఉన్న పాత లిఫ్ట్ ఈ ఘటనకు కార‌ణ‌మైంది. సెన్సార్లు స‌రిగా ప‌ని చేయ‌క‌పోవ‌డంతో రెండో అంత‌స్తులో దిగాల్సిన వ్య‌క్తి.. బ‌య‌ట‌కు వ‌చ్చేలోపే లిఫ్ట్ పైకి వెళ్ల‌డంతో ఈ ప్ర‌మాదం సంభ‌వించిందని హైడ్రా సిబ్బంది తెలిపారు. గంటన్నర పాటు శ్రమించిన హైడ్రా సిబ్బంది హైడ్రా కంట్రోల్ రూమ్‌కు ఆదివారం ఉద‌యం 9.15 గంట‌ల‌కు ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన స‌మాచారం అందింది . వెనువెంట‌నే ఉద‌యం 9.30 గంట‌ల‌కే హైడ్రా మార్ష‌ల్ జేడీవీ ప్ర‌సాద్ నేతృత్వంలోని బృందం అక్క‌డ‌కు చేరుకుంది. మూడో అంత‌స్తుకు - రెండో అంత‌స్తుకు మ‌ధ్య గ్రిల్స్‌లో కాలు ఇరుక్కొని వేళాడుతున్న ముర‌ళి అనే 40 ఏళ్ల వ్యక్తిని దాదాపు గంట‌న్న‌ర పాటు శ్రమించి హైడ్రా సిబ్బంది బ‌య‌ట‌కు తీశారు. లిఫ్ట్ గోడ‌ను బ‌ద్ద‌లు కొట్టి తీయాల్సి వ‌చ్చింద‌ని జేడీవీ ప్ర‌సాద్ తెలిపారు. స‌న‌త్‌న‌గ‌ర్ ఫైర్ సిబ్బందికి కూడా స‌మాచారం అంద‌జేయడంతో వారి వ‌ద్ద ఉన్న హైడ్రాలిక్ క‌ట్ట‌ర్ ద్వారా ఈ ఆప‌రేష‌న్‌ను పూర్తి చేశామ‌న్నారు. అసలేం జరిగిందంటే.. తన స‌తీమ‌ణితో క‌లిసి ముర‌ళి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రెండో అంత‌స్తుకు లిఫ్ట్ ఎక్కాడు. రెండో అంత‌స్తు చేర‌గానే ముర‌ళి బ‌య‌ట‌కు వెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఇంత‌లోనే 3వ అంత‌స్తులో లిఫ్ట్ బ‌ట‌న్ వేరే వాళ్లు ప్రెస్ చేయ‌గా క్ష‌ణాళ్లో పైకి వెళ్లిపోయింది. ముర‌ళి కాలు ఒక‌టి లిఫ్ట్‌లో - మ‌రొక‌టి రెండో అంత‌స్తులో ఉండ‌గా లిఫ్ట్ పైకి వెళ్లగా.. లిఫ్ట్ గ్రిల్స్‌లో ఆయన కాలు ఇరుక్కుంది. అప్ప‌టికే లిఫ్ట్‌లో ఉన్న ఆయ‌న స‌తీమ‌ణి కేక‌లు వేయ‌గా అపార్టుమెంటులో నివసిస్తున్న వారు కాపాడేందుకు ప్ర‌య‌త్నించారు. ఫ‌లితం లేక‌పోవ‌డంతో హైడ్రా కంట్రోల్ రూమ్‌కు ఫోను చేసి విష‌యాన్ని చెప్పారు. బాధితుడి కాలు ఫ్రాక్చర్ ఆ ద‌గ్గ‌ర్లోని కూక‌ట్‌ప‌ల్లిలో ఉన్న హైడ్రా డీఆర్ ఎఫ్ బృందం అక్క‌డ‌కు చేరుకుని సకాలంలో రెస్క్యూ ఆప‌రేష‌న్‌ ప్రారంభించింది. స‌రిగ్గా 10.50 గంట‌ల‌కు బ‌య‌ట‌కు తీసి ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ముర‌ళి కాలు లిఫ్ట్‌కు - గోడ‌కు మ‌ద్య‌లో న‌లిగిపోవ‌డంతో ఫ్యాక్చ‌ర్ అయ్యింది. స‌మాచారం అంద‌గానే వ‌చ్చి లిఫ్ట్‌లో ఇరుక్కుని వేలాడుతున్న ముర‌ళిని కింద నుంచి ప‌ట్టుకుని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీయ‌డంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. స‌న‌త్‌న‌గ‌ర్ ఫైర్ స్టేష‌న్ సిబ్బందితో పాటు హైడ్రా డీఆర్ ఎఫ్ స‌భ్యులు మార్ష‌ల్ జేడీవీ ప్ర‌సాద్‌, ఎర్ర‌సాని అనిల్‌కుమార్‌, ప‌ల్లికామిటి గోపి, జ‌మ్మ ర‌మేష్‌, వీత ర‌మేష్‌, పోలీసు కానిస్టేబుల్ న‌రేష్ ఈ ఆప‌రేష‌న్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని హైడ్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిం

Original source: telugu.abplive.com
Read more on Kaizer News