Kaizer News

Talakondapally: తలకొండపల్లి పట్టు సాగుకు తమిళనాడు

Talakondapally: తలకొండపల్లి పట్టు సాగుకు తమిళనాడు మంత్రి ప్రశంసలు!

· City - Hyderabad · hmtvlive.com

Shorts తలకొండపల్లి: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరింతకుంట గ్రామంలోని సెరికల్చర్ రిసోర్స్ సెంటర్‌ను తమిళనాడు గ్రామీణ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి శ్రీ పి. మాథన్ రాజా శనివారం సందర్శించారు. అనంతరం గ్రామంలోని మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక షెడ్లను పరిశీలించారు. తలకొండపల్లి రైతులు అవలంబిస్తున్న సెరికల్చర్ విధానాన్ని మంత్రి ప్రశంసించారు. ఆధునిక సాంకేతికతతో తక్కువ పెట్టుబడితో అధిక ఉత్పాదకత సాధిస్తున్న రైతుల కృషిని అభినందించారు. ఆదర్శ రైతు ముడావత్ శక్రు సేవలను ప్రత్యేకంగా ప్రశంసించిన మంత్రి.. తోటి రైతులను ప్రోత్సహించి మండలంలో సుమారు 120 పట్టు పురుగుల పెంపక షెడ్ల ఏర్పాటుకు ప్రేరణగా నిలిచారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ శక్రును తెలంగాణ సెరికల్చర్‌కు రోల్ మోడల్‌గా అభివర్ణించారు. రైతులను సెరికల్చర్ వైపు ప్రోత్సహిస్తున్న ఆయన కృషిని అభినందించారు. కార్యక్రమంలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల సెరికల్చర్ అధికారులు, రైతులు పాల్గొని ఆధునిక సాగు పద్ధతులు, సాంకేతికత, మల్బరీ ఉత్పాదకత పెంపుపై అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో తమిళనాడు పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ (హెచ్‌క్యూ) శ్రీమతి ఎస్. పొన్మారి, రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఎఫ్ఏసి), ధర్మపురి తిరు వి. ఇళయరాజా, డిప్యూటీ డైరెక్టర్ (ప్రీ-కకూన్) డా. ఎ. అబ్దుల్ ఫారూక్, టీఎన్ సెరికల్చర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్, హోసూర్ డిప్యూటీ డైరెక్టర్, ప్రిన్సిపాల్ తిరు ఎ. పళనిస్వామి, తిరుచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ తిరు ఎం. అరుళ్ సురేష్, దిండిగల్ అసిస్టెంట్ డైరెక్టర్ తిరు జాన్ పార్థిబన్, సేలం అసిస్టెంట్ డైరెక్టర్ తిరు శిలంబరసన్, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ తిరు ముత్తుకుమార్, ఉప్పిలియాపురం టీఎస్సీ జూనియర్ ఇన్‌స్పెక్టర్ తిరు వేలుస్వామి, జూనియర్ ఇన్‌స్పెక్టర్ తిరు శ్రీధర్, ఏడప్పాడి టీఎస్సీ జూనియర్ ఇన్‌స్పెక్టర్ తిరు పళనిస్వామి, అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ తిరు ఎన్. కుమార్ తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News