LB Nagar: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికకు అధికారులు లక్కీడ్రా నిర్వహిస్తున్నారు. ఎల్బీనగర్ పరిధిలోని బండ్లగూడ రాజీవ్ స్వగృహ కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం లాటరీ ప్రక్రియ చేపట్టారు. అర్హులైన దరఖాస్తుదారుల నుంచి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసి ప్లాట్లను కేటాయించనున్నారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు.. లాటరీలో తమ పేరు వస్తుందా? తమ సొంతింటి కల నెరవేరుతుందా? అంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. లాటరీ ఫలితాలపై దరఖాస్తుదారుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది