Kaizer News

Vijay Sethupathi | హాలీవుడ్‌లో నటించాలని ఉంది.. ఆ

Vijay Sethupathi | హాలీవుడ్‌లో నటించాలని ఉంది.. ఆ సినిమాలో నాకు ఛాన్స్ ఇవ్వండి: విజయ్ సేతుపతి

· Entertainment · ntnews.com

Vijay Sethupathi | టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తన కెరీర్ మరియు రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇటీవల నిథిలన్ స్వామినాథన్ తనకు ‘మహారాజా 2’ కథను వినిపించారని, ఆ కథ వినగానే తనకు ఎంతగానో నచ్చిందని ఆయన వెల్లడించారు. నిథిలన్ ఒక అద్భుతమైన దర్శకుడని ప్రశంసించిన విజయ్ సేతుపతి, మొదటి భాగం ‘మహారాజా’ విడుదల కాకముందు కొందరు ఈ సినిమాపై నమ్మకం ఉంచలేదని, కానీ తాను మాత్రం సినిమా విజయం సాధిస్తుందని గట్టిగా నమ్మానని గుర్తుచేసుకున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా హాలీవుడ్ నుంచి ఓ భారీ ఆఫర్ రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల నిర్మాత తనకు ఫోన్ చేసి ‘మహారాజా’ సినిమాను హాలీవుడ్‌కు అమ్మేశామని చెప్పారని, ఆ చిత్రంలో హాలీవుడ్ స్టార్ నటుడు మాథ్యూ మెక్‌కానగీ నటించబోతున్నారని తెలిపారన్నారు. ఈ విషయం విన్న వెంటనే తాను ఎంతో థ్రిల్ అయ్యానని, నిర్మాతతో మాట్లాడుతూ ‘ఒక సినిమాలో నేను ఉచితంగా నటిస్తాను.. కానీ ఆ హాలీవుడ్ రీమేక్‌లో నాకు కూడా ఒక చిన్న పాత్ర ఇప్పించండి.. నేను అక్కడికి వెళ్లి నటిస్తాను’ అని సరదాగా అన్నట్లు విజయ్ సేతుపతి తెలిపారు. తనకు మొదటి నుంచీ హాలీవుడ్‌లో నటించాలనే బలమైన కోరిక ఉందని, తన సినిమా అక్కడకు చేరుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని ఆయన మనసులోని మాటలను బయటపెట్టారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి

Original source: ntnews.com
Read more on Kaizer News