Kaizer News

Shaktisat | జెన్‌ జీ విద్యార్థినులతో శక్తిశాట్‌ ని

Shaktisat | జెన్‌ జీ విద్యార్థినులతో శక్తిశాట్‌ నిర్మాణం.. చుంద్రుడిని చేరుకోవడమే లక్ష్యం

· National - India · ntnews.com

Shaktisat | ప్రపంచ వ్యాప్తంగా జెన్‌ జీ (Gen Z) విద్యార్థినులకు శాటిలైట్‌ టెక్నాలజీ, ఆవిష్కరణలపై శిక్షణ ఇచ్చేందకు ‘మిషన్‌ శక్తిశాట్‌ (Mission Shaktisat)’ను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకోసం 108 దేశాలకు చెందిన 12,000 మంది విద్యార్థినులను ఎంపిక చేశారు. ఈ మిషన్‌ శక్తిశాట్‌ రెండో దశ కార్యక్రమం యూపీలోని గ్రేటర్‌ నోయిడాలో ఉన్న గౌతమ్‌ బుద్ధ యూనివర్సిటీలో ప్రారంభించారు. వీరిలో భారత్‌కు చెందిన సుమారు 100 మంది విద్యార్థినులు ఉన్నారు. విద్యార్థినుల భాగస్వామ్యంతో రూపొందించే ఉపగ్రహాన్ని చండ్రుడి కక్ష్యలోకి పంపనున్నారు. చెన్నైకి చెందిన స్పేస్‌ కిడ్జ్‌ (Space kidz) నేతృత్వంలో ప్రారంభించిన బాలికల అంతరిక్ష పరిజ్ఞానం కోసం చేపట్టిన కార్యక్రమం ఇది. వివిధ దేశాల పాఠశాల విద్యార్థినుల (14-18 వయస్సులోపు)ను సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై దృష్టిసారించేందుకు దీన్ని చేపట్టారు. దీనిలో భాగంగా విద్యార్థినులకు స్పేస్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌, శాటిలైట్‌ పేలోడ్‌ అభివృద్ధి, కోడింగ్‌పై మొదట ఆన్‌లైన్‌లో శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం వీరిని ఒకచోట చేర్చి అనుభవజ్ఞులైన ఇంజినీర్లతో శిక్షణ ఇప్పిస్తున్నారు. విద్యార్థినులు రూపొందించే శాటిలైట్‌ చంద్రుడిపైకి పంపుతాము అని ‘స్పేస్‌ అమ్మ’గా పిలిచే స్పేస్‌ కిడ్జ్‌ వ్యవస్థాపకురాలు కేసన్‌ తెలిపారు. ప్రధాని మోదీ 137వ మన్‌ కీ బాత్‌ (Mann ki Baat)లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినులను ప్రశంసిస్తూ మాట్లాడారు. ఆడపిల్లలు భూమి నుంచి బాలికల్లో చాలామంది సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఆవిష్కరణల రంగాల్లో రాణిస్తారనే నమ్మకం కలిగిందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువతుల ఆశయాలకు భారత్‌ ప్రధాన కేంద్రంగా మారేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తున్నదని వెల్లడించారు. నేడు మన కుమార్తెల కలలు భూమి పరిధి దాటి అంతరిక్షంవైపు దూసుకెళ్తున్నాయని అన్నారు. మిషన్‌ శక్తిశాట్‌ ద్వారా ప్రపంచంలోని నలుమూలల నుంచి ఆడబిడ్డలను ఒకచోట చేర్చి అంతరిక్షం వైపు పయనించేందుకు శిక్షణ ఇవ్వడం భారత్‌కు గర్వకారణం అని పేర్కొన్నారు

Original source: ntnews.com
Read more on Kaizer News