Kaizer News

నిషేధిత ఉచ్చు కాలనీలల్లో 22ఏ కల్లోలం

నిషేధిత ఉచ్చు కాలనీలల్లో 22ఏ కల్లోలం

· City - Hyderabad · ntnews.com

నగరంలో ఆస్తి మనదేనా.. అమ్మగలమా? జీవితమంతా కష్టపడి కట్టుకున్న ఇండ్లపై 22ఏ పిడుగు కష్టార్జితంపై హక్కులు కోల్పోయి ప్రజల మనోవేదన రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో ‘మధ్యతరగతి’ ఆవేదన సొసైటీలు, కాలనీలన్నీ నిషేధిత జాబితాలోకి.. కాంగ్రెస్‌ సర్కార్‌పై సామాన్యుడి తీవ్ర అసహనం నగరం నిషేధిత జాబితాలో చిక్కుకుని విలవిలలాడుతున్నది. కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తుల హక్కులు కోల్పోయి ప్రజలు అల్లాడుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా ఏ కాలనీ చూసినా నిషేధిత జాబితాలో కొట్టుమిట్టాడుతున్నది. అన్ని ప్రభుత్వ అనుమతులతో పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇండ్లు 22ఏలోకి చేరడంపై ఆయా కాలనీల ప్రజలు మనోవేదనకు గురవుతున్నారు. కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, పలు కాలనీల సొసైటీలు, లేఅవుట్లు, అపార్ట్‌మెంట్ల సముదాయాల ప్రజలు తమ ఇండ్లు, ఆస్తుల పరిస్థితేంటని ఆరా తీస్తున్నారు. పైసా పైసా కూడబెట్టుకుని నిర్మించుకున్న ఇండ్లపై తమకు హక్కులు లేని పరిస్థితికి వచ్చేసరికి తీవ్ర మనస్తాపం చెందుతున్నారు. తిండి, నిద్రలకు ఓర్చుకుని కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అకారణంగా ప్రభుత్వం పేరిట చేరడంతో కలత చెందుతున్నారు. పట్టా భూముల్లో ఇండ్లు నిర్మించుకునేందుకు అన్ని అనుమతులిచ్చిన ప్రభుత్వమే నిషేధిత జాబితాలోకి మార్చడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు అమ్ముకోలేని, కొనుక్కోలేని దుస్థితికి చేరడంపై ఆవేదన చెందుతున్నారు. దశాబ్దాల కాలం కిందట ఏర్పడిన కాలనీలను ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పాలన పేరిట ప్రజా వంచన పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దల రియల్‌ దందా సాగించేందుకే సామాన్య ప్రజల ఆస్తులను ప్రభుత్వ జాబితాలోకి మారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. సిటీబ్యూరో/మేడ్చల్‌, సెప్టెంబర్‌ 18 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా అన్ని కాలనీలు నిషేధిత జాబితాలో చేరడంతో ఇండ్లు, స్థలాలు కొనలేని, అమ్మలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా కాలనీల ప్రజలు ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఆస్తులను అమ్ముకుందామన్నా ప్రభుత్వ కబ్జాలో ఉండటంతో ఆగమాగమవుతున్నారు. పిల్లల చదువులు, పెండ్లిండ్ల కోసం జీవితాంతం కష్టపడి సమకూర్చుకున్న సొంత ఆస్తులను అమ్ముకోలేని దుర్భర స్థితిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ప్రజలు ఉన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని గ్రామాలకు గ్రామాలు, కాలనీలు, హౌసింగ్‌ సొసైటీలు, లేఅవుట్‌లు, వెంచర్లన్నీ 22ఏలో చేరిన ఘటనలు ప్రజలను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి. హైరైజ్డ్‌ భవనాలు, అపార్ట్‌మెంట్లలోని వేలాది ఫ్లాట్లను నిషేధిత జాబితాలో చేర్చడంతో పైసా పైసా కూడబెట్టుకుని, బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని కొనుక్కున్న కలల సౌధాన్ని ప్రభుత్వం తనదంటుండటంతో వేతన జీవులు కుంగిపోతున్నారు. ఏండ్ల తరబడిగా పట్టా భూములుగా కొనసాగిన తమ స్థలాలు ఉన్నట్టుండి నిషేధిత జాబితాలోకి చేర్చడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న తమ ఆస్తులను జాబితా నుంచి తొలగించుకునేందుకు దరఖాస్తులు చేసుకుంటే తప్ప అధికారులు పరిశీలించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నిషేధిత జాబితా నుం

Original source: ntnews.com
Read more on Kaizer News