జబర్దస్త్ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిందనే చెప్పాలి. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న నటీనటులు ఈ షో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే తాజాగా ఓ జబర్దస్త్ కమెడియన్ తన సినీ ప్రస్థానాన్ని పంచుకున్నారు. ఆలీ అన్నయ్య దగ్గర నాలుగేళ్లు కార్ డ్రైవర్‌గా పనిచేసిన రోజులు, ఆ తర్వాత నటుడిగా మారిన వైనం వివరించారు. రాజశేఖర్ వీరాభిమానిగా హైదరాబాద్ వచ్చి, కష్టాలు ఎదుర్కొని, సహనంతో సినీ రంగంలో ఎలా నిలదొక్కుకున్నారో తెలిపారు