Kaizer News

Immortal Review | ‘ఇమ్మోర్టల్‌’ రివ్యూ.. జీవీ ప్రక

Immortal Review | ‘ఇమ్మోర్టల్‌’ రివ్యూ.. జీవీ ప్రకాశ్, కయాడుల హారర్ థ్రిల్లర్ మెప్పించిందా?

· Entertainment · ntnews.com

సినిమా రివ్యూ: ఇమ్మోర్టల్‌ (Immortal) నటీనటులు: జీవీ ప్రకాశ్‌ కుమార్‌, కయాదు లోహర్‌, టీఎమ్‌ కార్తిక్‌, కుమార్‌ నటరాజన్‌, ఆదిత్య కథిర్‌ తదితరులు సంగీతం: శ్యామ్‌ సీఎస్‌ రచన, దర్శకత్వం: మారియప్పన్‌ చిన్న మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎప్పుడూ బిజీగా ఉండే జీవీ ప్రకాశ్‌ కుమార్‌, హీరోగానూ వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన నటించిన సరికొత్త హారర్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్‌’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఏ మేరకు భయపెట్టింది? కథేంటి? రివ్యూలో తెలుసుకుందాం! కథ హైదరాబాద్‌లో తన మామయ్యకు చెందిన ప్రింటింగ్‌ ప్రెస్‌లో డిజైనర్‌గా జాబ్ చేస్తుంటాడు మహి (జీవీ ప్రకాశ్‌ కుమార్‌). అద్దె ఇంటి కోసం ప్రతిరోజూ నానా అవస్థలు పడుతుంటాడు. తక్కువ బడ్జెట్‌లో మంచి ఇల్లు దొరకక సతమతమవుతున్న తరుణంలో.. సింధు (కయాదు లోహర్‌) అనే యువతి షేరింగ్‌ ఫ్లాట్ గురించి ఫోన్ చేస్తుంది. ఆమె చెప్పిన అడ్రస్‌కి వెళ్లిన మహి, తొలి చూపులోనే సింధు అందానికి మనసు పారేసుకుంటాడు. మహి కోరిందల్లా క్షణాల్లో సమకూరుస్తూ సింధు కూడా అతనికి చాలా దగ్గరవుతుంది. అయితే అదే ఫ్లాట్‌లో ఉంటున్న సింధు తాతయ్య ఆకాశ్‌ (టీఎమ్‌ కార్తిక్‌) ద్వారా ఆమె గురించి ఒక దిగ్భ్రాంతికరమైన నిజం బయటపడుతుంది. ఆ షాకింగ్ విషయం తెలిశాక మహి ప్రాణభయంతో వణికిపోతాడు. అసలు సింధు ఎవరు? ఆమె వెనుక ఉన్న రహస్యం ఏంటి? వెయ్యేళ్ల కిందటి మృగానికి సింధుకూ ఉన్న సంబంధం ఏంటి? చివరికి మహి ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నదే మిగతా కథ. విశ్లేషణ: హారర్ జోనర్‌కు ఫాంటసీ, థ్రిల్లర్ అంశాలను జోడించి కొత్త ప్రయత్నం చేయాలని దర్శకుడు మారియప్పన్‌ చిన్న చేసిన ప్రయత్నం అభినందనీయం. అయితే కథా నేపథ్యం కాస్త పాతదే అయినప్పటికీ, దాన్ని మలిచిన తీరులో కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. సినిమా ప్రారంభం హీరో అద్దె ఇళ్ల కోసం పడే తిప్పలతో సామాన్యంగా మొదలవుతుంది. సింధు ఎంట్రీతో కథ వేగవంతం అవుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో దర్శకుడు ఇచ్చిన ట్విస్ట్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితీయార్ధంలో వచ్చే సన్నివేశాలు, ప్రీ-క్లైమాక్స్ మరియు చివరి 20 నిమిషాల యాక్షన్‌ సీక్వెన్స్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దర్శకుడు లాజిక్‌లకు కాస్త ఎక్కువగానే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ, ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. సీక్వెల్ ఉంటుందని హింట్ ఇస్తూ ముగించిన విధానం ఆకట్టుకుంటుంది. నటీనటులు: మహి పాత్రలో జీవీ ప్రకాశ్‌ కుమార్‌ చాలా సహజంగా నటించారు. ముఖ్యంగా భయం, ఆశ్చర్యం, ప్రేమ వంటి విభిన్న భావోద్వేగాలను తన హావభావాలతో బాగా పండించారు. ఇక ఈ సినిమాకు అసలైన ప్రాణం కయాదు లోహర్‌. సింధు పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు, కళ్ల ద్వారా పలికించిన ఎక్స్‌ప్రెషన్స్ సినిమాను నిలబెట్టాయి. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు బాగానే నటించారు. సాంకేతికంగా ఈ సినిమాకు శ్యామ్‌ సీఎస్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా పెద్ద ప్లస్ పాయింట్. అనేక సాధారణ సన్నివేశాలను కూడా తన నేపథ్య సంగీతంతో థ్రిల్లింగ్‌గా మార్చారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ కథకు తగినట్లుగా ఉన్నాయి. పరిమిత బడ్జె

Original source: ntnews.com
Read more on Kaizer News