Kaizer News

బీచ్‌కి రావాలంటే అమ్మాయి ఉండాల్సిందే.. బోల్డ్‌గా ‘

బీచ్‌కి రావాలంటే అమ్మాయి ఉండాల్సిందే.. బోల్డ్‌గా ‘డానీ’ ఫస్ట్ స్ట్రైక్

· Entertainment · sakshi.com

ఆశిష్ గాంధీ, సేజల్ గుప్తా, సోనాల్ సింగ్, అజర్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘డానీ’. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, కళ్యాణ్‌జీ కంటెంట్ పిక్చర్స్ బ్యానర్‌ల మీద రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్‌జీ గోగణ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ రొమాంటిక్ క్రైమ్ డ్రామా నుంచి ఫస్ట్ స్ట్రైక్ ను తాజాగా విడుదల చేశారు. ‘నువ్వు బీచ్‌కి ఎప్పుడూ ఒంటరిగా వస్తావా?’.. అని అమ్మాయి అడగడం.. ‘నేను బీచ్‌కి రావాలంటే కచ్చితంగా అమ్మాయి ఉండాల్సిందే’ అని హీరో చెప్పే డైలాగ్.. ఆ తర్వాత వచ్చే బోల్డ్ డైలాగ్, బీచ్‌లో అమ్మాయి అందాలు ఇలా అన్నీ కూడా యూత్ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఈ టీజర్‌ని గమనిస్తే కావాల్సినంత యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఉందని అర్థం అవుతోంది. బోల్డ్, రా అండ్ రస్టిక్‌గా ‘డానీ’ రానుందని ఈ ఫస్ట్ స్ట్రైక్ చెప్పకనే చెబుతోంది. కళ్యాణ్‌జీ గోగన–ఆశిష్ గాంధీ కాంబినేషన్‌లో వచ్చిన ‘నాటకం’, ‘కళింగ’ చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి. ఇప్పుడు ఈ సక్సెస్‌ఫుల్ కాంబో మరోసారి ‘డానీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై ఆసక్తి, క్యూరియాసిటీ మరింత పెరుగుతోంది. డానీ ఫస్ట్ స్ట్రైక్ లోని విజువల్స్, కెమెరా వర్క్ టాప్ నాచ్‌లో ఉంది. సాయి కార్తీక్ బీజీఎం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ మూవీకి ఖుషి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏకే ఆనంద్ కెమెరామెన్‌గా, మణికాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర అప్డేట్లను మేకర్స్ ప్రకటించనున్నారు. ఇక అక్టోబర్ లో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు) నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు) తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు) సైమా అవార్డ్స్ 2026 వేడుకలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ (ఫొటోలు) ముంబై : వినాయక చవితి వేడుకల్లో బాలీవుడ్‌ జంట సందడి (ఫొటోలు) నన్నే భయపెట్టాలని చూస్తావా.. గుర్తుపెట్టుకో పెమ్మసాని లోన్ తీసుకునేవారికి RBI షాక్.. పెరగనున్న EMI భారం నీళ్లు లేని చెరువుల్లో గణేష్ నిమజ్జనాలు.. అసలేం జరిగిందంటే!

Original source: sakshi.com
Read more on Kaizer News