Kaizer News

Switzerland | స్విట్జర్లాండ్ రేవ్ పార్టీలో కాల్పుల

Switzerland | స్విట్జర్లాండ్ రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరు మృతి.. ఐదుగురికి గాయాలు

· National - India · ntnews.com

Switzerland : స్విట్జర్లాండ్లో దారుణం జరిగింది. ఒక రేవ్ పార్టీపై కాల్పులు జరపడంతో ఒకరు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన నార్తర్న్ స్విట్జర్లాండ్‌లోని అరావు ప్రాంతంలో ఆదివారం వేకువఝామున 3.00 గంటల సమయంలో జరిగింది. ఘటన జరిగిన ప్రదేశం స్విట్జర్లాండ్ రాజధాని జ్యురిచ్‌కు 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆరావు ప్రాంతంలోని ఒక రేస్ కోర్సులో అరావు రేవ్ వాల్యూమ్ 7 పేరుతో ఒక స్విట్జర్లాండ్‌ ఈవెంట్ కంపెనీ రేవ్ పార్టీ ఏర్పాటు చేసింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం వేకువఝాము వరకు ఈ ఈవెంట్ జరిగింది. దీనికి దాదాపు 3,500 మంది వరకు హాజరయ్యారు. అయితే, ఒక గుర్తు తెలియన వ్యక్తి వేకువఝామున ఈవెంట్‌లో పాల్గొన్న వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడే మరణించాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. అలాగే, ఇంకా ఎవరైనా గాయపడ్డారా అనే సమాచారం కూడా తెలియాల్సి ఉంది. కాల్పులు అనంతరం నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందడంతో అర్గ్వే క్యాంటోనల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆధారాల సేకరణ, గాలింపు చర్యలు పూర్తయ్యే వరకు స్థానికులు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ కాల్పుల ఘటనకు గల కారణాలు కూడా తెలియదని పోలీసులు వివరించారు. నిందితుడిని అరెస్టు చేసిన అనంతరమే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. మరోవైపు స్విట్జర్లాండ్‌లో ఇటీవల గన్ కల్చర్ పెరిగిపోయింది. ఎక్కువ మంది పౌరులు గన్ కలిగి ఉండటం వల్ల దాడులు కూడా పెరిగిపోయాయి. దీనిపై ప్రజల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గన్ వాడే విషయంలో నిబంధనలు కఠినతరం చేయాలని స్విట్జర్లాండ్ ప్రభుత్వం భావిస్తోంది

Original source: ntnews.com
Read more on Kaizer News