Kaizer News

Udaygiri: ఉదయగిరి దుర్గాన్ని సందర్శించిన ఇండియన్ న

Udaygiri: ఉదయగిరి దుర్గాన్ని సందర్శించిన ఇండియన్ నేవీ ప్రతినిధులు!

· National - India · hmtvlive.com

Udaygiri: నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణానికి ఇండియన్ నేవీ సిబ్బంది ప్రత్యేకంగా బైక్‌లపై చేరుకున్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా ఉదయగిరికి బైక్‌పై ప్రయాణించి వచ్చారు.ఐఎన్ఎస్ ఉదయగిరి నౌక 2025 ఆగస్టు 26న ప్రారంభమైందని నేవీ సిబ్బంది తెలిపారు. నౌక ప్రారంభమై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తొలి వార్షికోత్సవాన్ని ఉదయగిరిలో జరుపుకోవడానికి వచ్చినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఉదయగిరిలోని పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ఇండియన్ నేవీ విశిష్టత, దేశ రక్షణలో నౌకాదళం ప్రాధాన్యత, నేవీలో ఉన్న అవకాశాలపై అవగాహన కల్పించారు.అలాగే ఉదయగిరి చారిత్రక ప్రాధాన్యతను తెలుసుకునేందుకు ఉదయగిరి దుర్గాన్ని సందర్శించి, దాని విశిష్టతలను తెలుసుకుంటామని నేవీ సిబ్బంది తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి పాఠశాలలో టాప్-3లో నిలిచే ముగ్గురు విద్యార్థులకు ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్‌లు అందజేస్తామని ప్రకటించారు.ఐఎన్ఎస్ ఉదయగిరి పేరుతో తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావడం గర్వకారణమని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News