అధికార దాహంతో సీటుకే ఎసరు తెచ్చుకున్న దానం నాలుగు దశాబ్దాల రాజకీయంలో నాలుగు సార్లు పార్టీలు జంప్ రెండోసారి ఉప ఎన్నిక ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న నాగేందర్ 2004లో వైఎస్ హవాలోనూ దానంకు బెడిసికొట్టిన ఉప ఎన్నిక ప్రజాసేవ మరిచి అధికారం కోసం పాకులాడితే తగిన గుణపాఠమే! ఖైరతాబాద్ ఉపఎన్నిక తప్పదా ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు.. ఓటేసి గెలిపించిన ప్రజలంటే లెక్కే లేదు.. నాలుగు దశాబ్దాల రాజకీయంలో ఒక్కటే పాలసీ! అదే అధికారం!! దాని కోసం ఏమైనా చేస్తారు.. విలువలకు పాతర వేస్తారు. అంగీలు మార్చినంత సులువుగా పార్టీ కండువాలు మార్చుతారు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏకంగా నాలుగు సార్లు పార్టీ కండువాలు మార్చిన చరిత్ర దానం నాగేందర్ సొంతం. పైగా అధికారం వెనక పరుగులు పెట్టి బొక్కబోర్లా పడి ఉప ఎన్నిక ఎదుర్కోవడం.. దానం అధికార దాహాన్ని చీదరించుకొని ఓటర్లు తగిన గుణపాఠం చెప్పడం కొత్తేమీ కాదు. ఈ నేపథ్యంలో దానం నాగేందర్‌కు తాజాగా హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. గులాబీ జెండాతో గెలిచి.. ఓటరు వేలికి సిరా ఆరకముందే కాంగ్రెస్ కండువా కప్పుకొనడమే కాకుండా ఆ పార్టీ జెండాపై పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి పార్టీ మారలేదంటూ బుకాయించారు. కానీ న్యాయస్థానం దిమ్మతిరిగే రీతిలో దానంపై వేటు వేయడంతో ఖైరతాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారే అవకాశాలున్నాయి. దీంతో ‘మనకు ఉపఎన్నిక అచ్చిరాదు కదా!’ అని జంపింగ్ జపాంగ్ అనుచరులు ఆందోళన చెందుతున్నట్లు చర్చ జరుగుతున్నది. – సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్‌ఎస్ నుంచి గోడ దూకి అధికార పార్టీ కండువా కప్పుకొన్న దానం నాగేందర్‌పై హైకోర్టు ససెన్షన్ వేటు వేయడం హైదరాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సందర్భంలో దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానంపైనా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా దానం నాగేందర్ ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ప్రతిసారీ అధికార కోసం వెంపర్లాడటం తప్ప.. ప్రజా సేవలో చిత్తశుద్ధిగా వ్యవహరించిన దాఖలాలు లేవనే ప్రచారం ఉంది. ఇందుకు బలాన్ని చేకూర్చేలా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దానం ఏకంగా నాలుగు పర్యాయాలు పార్టీ రంగులు మార్చడంపై నగర ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉంది. ఓట్లేసిన జనం సమస్యలు తీర్చేందుకు అధికారంలో ఉంటే కృషి… ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేయాల్సిన నాయకుడు ప్రజా సమస్యల్ని గాలికి వదిలి అధికారం కోసం ఊసరవెల్లి రంగులు మార్చినట్లు పార్టీ కండువాలు మార్చడమేందని నగరవాసులు విమర్శిస్తున్నారు. పీజేఆర్ అనుచరుడిగా నగర రాజకీయాల్లోకి వచ్చిన దానం నాగేందర్ చివరకు ఆయన బతికి ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే పీజేఆర్ ప్రత్యర్థి అయిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పంచన చేరి ఆయన్ని మానసిక క్షోభకు కారణమయ్యాడనేది సీనియర్ నేతల విశ్లేషణ. అంతేకాదు ఇప్పుడు పీజేఆర్ వారసుల అవకాశాలను కూడా కొల్లగొట్టడంలో ముందు వరుసలో ఉండి, పీజేఆర్‌పై వైఎస్ కక్ష సాధింపునకు ఒక పావుగా మారాడని పీజేఆర్ అనుచరులు ఇప్పటికీ వి