Shorts అబ్దుల్లాపూర్‌మెట్: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆదేశాల మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం చిన్న రావిరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ, యువజన కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బింగి దేవదాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడిగా చింతల మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బంగారి సత్యనారాయణ, సదిపల్లి శివశంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కండికోట శివశంకర్ రెడ్డి, కోశాధికారిగా శేఖర్ రెడ్డితో పాటు పలువురిని నియమించారు. యువజన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడిగా కారెడ్డి అమూల్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బండారి శివ, ప్రధాన కార్యదర్శిగా ఒంటేది శ్రీనివాస్, కోశాధికారిగా శివ, కార్యదర్శిగా సంపంగి అనిల్‌ను నియమించారు. ఈ సందర్భంగా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించడంపై నాయకులు చర్చించారు. నూతన కమిటీలకు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు