Kaizer News

Penumantra: మార్టేరులో వైద్య ఆరోగ్యశాఖ ఇంటింటి జ్వ

Penumantra: మార్టేరులో వైద్య ఆరోగ్యశాఖ ఇంటింటి జ్వరాల సర్వే!

· Health · hmtvlive.com

Penumantra: పెనుమంట్ర మండలంలో మార్టేరు గ్రామంలో జ్వరాల నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మార్టేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మార్టేరు, గ్రామము లోని వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి జ్వరాలసర్వేనిర్వహిస్తున్నారు.ఇళ్లలో జ్వరాలతో బాధపడుతున్న వారి వివరాలను సేకరించడంతో పాటు, దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వలను పరిశీలిస్తున్నారు. కొబ్బరిడొక్కలు,రుబ్బు రోళ్లు, ఆరుబయట పడేసిన పనికిరాని సామగ్రిలో నీరు నిల్వ ఉంటే దోమలు గుడ్లు పెట్టి వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉందని సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యం పెద్ద ముప్పు ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండాచూసుకోవాలనిపనికిరాని సామగ్రిని తొలగించాలనిసూచించారుదోమల వృద్ధిని తొలిదశలోనే అరికట్టడం ద్వారా మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల వ్యాప్తిని నియంత్రించవచ్చని వైద్య సిబ్బంది తెలిపారు. ప్రజలు ఆరోగ్య శాఖ సిబ్బందికి సహకరించి పరిసరాలను పరిశుభ్రంగాఉంచుకోవాలని కోరారు.ఈ సర్వ్ లొ హెల్త్ అసిస్టెంట్ డి. రామకృష్ణ ఏఎన్ఎం ఎస్ వి .దుర్గమ్మ, ఎన్ పద్మ, బి . సుజాత, ఎం ఎల్ హెచ్ పి .కె అలేఖ్య, పి. సంధ్య మరియు ఆశ వర్కర్లు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News