Kaizer News

బెర్క్‌షైర్‌ హ్యాథవేకు బఫెట్‌ బై

బెర్క్‌షైర్‌ హ్యాథవేకు బఫెట్‌ బై

· Business · ntnews.com

చైర్మన్‌గా తప్పుకున్న దిగ్గజ మదుపరి 56 ఏండ్లపాటు సేవలు కొడుకే ఇక కొత్త సారథ్కిషైర్‌ హ్యాథవేకు సారథిగా కొనసా గిన విషయం తెలిసిందే. 56 ఏండ్లపాటు కంపెనీని ముందుండి నడిపించిన ఈయన.. ఇకపై చైర్మన్‌ ఎమిరేట్స్‌గా ఉంటారు. ఈ మేరకు శుక్రవారం కంపెనీ స్పష్టం చేసింది. అలాగే సంస్థ బోర్డులో ఆయన డైరెక్టర్‌గా ఉంటారన్నది. కాగా, గత ఏడాదే కంపెనీ సీఈవోగా వారెన్‌ బఫెట్‌ తప్పుకున్న సంగతి విదితమే. దీంతో ఆ బాధ్యతలు గ్రెగ్‌ అబెల్‌ చేతికి వచ్చాయి. బెర్క్‌షైర్‌ హ్యాథవే నూతన చైర్మన్‌గా బఫెట్‌ కుమారుడు హోవర్డ్‌ బఫెట్‌కే బాధ్యతలు దక్కాయి. 1993 నుంచి కంపెనీ బోర్డులో హోవర్డ్‌ ఉన్నారు. ఇక వాటాదారులకు రాసిన ఓ లేఖలో ‘1965 నుంచి బెర్క్‌షైర్‌కు సేవలు అందిస్తున్నాను’ అని బఫెట్‌ అన్నారు. ‘ఈ వృత్తిలో 60 ఏండ్లకు పైగా ఉన్నప్పటికీ.. ఇంకా ప్రపంచంలో అత్యుత్తమ ఉద్యోగం నాదే. నా వయసులో ఉన్నవారెవరూ ఇలా చెప్పలేరు’ అంటూ బెర్క్‌షైర్‌ హ్యాథవేతో తనకు ఏర్పడిన విడదీయరాని అనుబంధాన్ని బఫెట్‌ ఈ సందర్భంగా వివరించారు. అబెల్‌, హోవర్డ్‌ సారథ్యంలో కంపెనీ మరిన్ని విజయాలను సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే బెర్క్‌షైర్‌ హ్యాథవే స్టాక్స్‌ ద్వారా బఫెట్‌ సంపద గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది జూలై 2026నాటికి అది 140 బిలియన్‌ డాలర్లకు పైగానే ఉన్నది. నిజానికి 2006 నుంచి బఫెట్‌ దాదాపు 66 బిలియన్‌ డాలర్ల స్టాక్స్‌ను వదులుకున్నారు. ఇక దాతృత్వంలోనూ ఆయన మేటిగానే నిలిచారు

Original source: ntnews.com
Read more on Kaizer News