ఇన్నాళ్లూ పూర్తిగా ఉచితంగా సాగిపోయిన యూపీఐ (UPI) లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, ఆన్‌లైన్‌లో రూ.2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రం యూపీఐపై ఎండీఆర్ ఛార్జీలు తీసుకురావడం వెనుక అమెరికా ఒత్తిడి ఉందన్న ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగా తెరపైకి వచ్చాయి. యూపీఐపై ఇన్నాళ్లుగా కొనసాగుతున్న జీరో ఎండీఆర్ విధానాన్ని అమెరికాకు చెందిన చెల్లింపుల సంస్థలు వ్యతిరేకిస్తున్నాయని, ఆ ఒత్తిడితోనే కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. కేంద్రం నిర్ణయం వెనుక నిజంగా అమెరికా ఒత్తిడి ఉందా? ఇప్పుడు ఇదే ప్రశ్న తీవ్ర చర్చకు దారితీసింది. రూ.2 వేలకు మించిన కొన్ని యూపీఐ వ్యాపార లావాదేవీలపై అక్టోబర్ 15 నుంచి 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమల్లోకి రానుంది. అయితే ఇది వినియోగదారుల నుంచి నేరుగా వసూలు చేసే ఛార్జీ కాదని కేంద్రం అంటోంది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే యూపీఐ చెల్లింపులు కూడా పూర్తిగా ఉచితంగానే ఉంటాయి. అందుకే ఇప్పుడు అసలు ప్రశ్న యూపీఐపై ఛార్జీలు వచ్చాయా అన్నది మాత్రమే కాదు. ఈ నిర్ణయం వెనుక ఆర్థిక కారణాలే ఉన్నాయా? లేక అమెరికా ఒత్తిడి కూడా ఉందా? అన్నదే ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 15 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని, ఆన్‌లైన్‌లో రూ.2,000 దాటిన చెల్లింపులపై ఛార్జీలు బాదుతారనే వార్తలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే లేదా ఇతర యూపీఐ యాప్‌ల ద్వారా షాపుల్లో డబ్బులు చెల్లించినా, స్నేహితులకు పంపినా మన జేబుకు చిల్లు పడుతుందా? అసలు ఈ ప్రచారంలో నిజమెంత? కొత్త రూల్స్ ఎవరికి వర్తిస్తాయి? మనం దైనందిన జీవితంలో కిరాణా కొట్లలో సామాన్లు కొన్నా, మాల్స్‌లో షాపింగ్ చేసినా ఫోన్ తీసి క్షణాల్లో యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లిస్తుంటాం. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి (P2P) డబ్బులు పంపినప్పుడు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఉదాహరణకు మీ స్నేహితుడికి రూ.10 వేలు పంపినా, కుటుంబ సభ్యులకు బదిలీ చేసినా రూపాయి కూడా అదనంగా కట్టాల్సిన అవసరం లేదు. మరి ఈ ఛార్జీల వార్తలు ఎందుకు వస్తున్నాయి అంటే.. కొత్త నిబంధనల ప్రకారం అక్టోబర్ 15 నుంచి కొన్ని నిర్దిష్టమైన వ్యాపార చెల్లింపులపై మాత్రమే ‘ఎండీఆర్’ వర్తిస్తుంది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఛార్జీలను సాధారణ కస్టమర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం వ్యాపారులు మాత్రమే దీన్ని భరించాల్సి ఉంటుంది. మీరు ఏ వ్యక్తికైనా ఎంత మొత్తమైనా ఉచితంగా పంపుకోవచ్చు. అయితే ఒక వ్యాపారికి లేదా పెద్ద సంస్థకు రూ.2,000 కంటే ఎక్కువ యూపీఐ చెల్లింపులు చేసే సందర్భాల్లో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇక సాధారణ వ్యాపార లావాదేవీల్లో రూ.2,000 దాటిన చెల్లింపులపై కొన్ని సందర్భాల్లో 0.4 శాతం వరకు ఎండీఆర్ వర్తించవచ్చు. అయితే ఈ మొత్తాన్ని ఎప్పుడూ కస్టమర్ల నుంచి వసూలు చేయకూడదు. ఈ ఛార్జీ గరిష్ఠంగా రూ.300 వరకు పరిమితం చేశారు. ఉదాహరణకు రెస్టారెంట్‌లో రూ.6,000 బిల్లు కడితే వచ్చే ఎండీఆర్‌ను రెస్టారెంట్ యజమానే భరిస్తారు. మీరు కేవలం ఆ రూ.6,000 మాత్రమే చె