Kaizer News

Salary Budgeting Tips : నెల చివరిలో డబ్బులు సరిపోవ

Salary Budgeting Tips : నెల చివరిలో డబ్బులు సరిపోవట్లేదా? అయితే శాలరీ రాగానే(Salary Credit) ఈ టిప్స్ ఫాలో అవ్వండి

· Health · telugu.abplive.com

జీతం రాగానే సరైన ప్రణాళిక లేకపోవడం ఆర్థిక ఇబ్బందులకు మూలం. ముందుగా పొదుపు చేసి, నెలవారీ బిల్లులు వెంటనే చెల్లించడం ముఖ్యం. రోజువారీ ఖర్చులకు పరిమితి, UPI లావాదేవీల ట్రాకింగ్ అవసరం. Money Management Tips to Avoid Month-End Financial Stress : నెల మొదట్లో శాలరీ అకౌంట్‌లో పడగానే మనసుకు కాస్త హాయిగా ఉంటుంది. కానీ అద్దె, కరెంట్ బిల్లు, EMIలు, పిల్లల స్కూల్ ఖర్చులు, కిరాణా, బయట తినడం, షాపింగ్, ఆన్‌లైన్ ఆర్డర్లు.. ఇలా ఒక్కొక్కటి చెల్లిస్తూ పోతే నెల మధ్యలోనే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది. నెల చివరికి ఏదైనా అత్యవసర ఖర్చు వస్తే జీతం రావడానికి ఇంకా ఎన్ని రోజులు ఉందని కౌంట్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి సమస్య జీతం తక్కువగా ఉండటమే కాదు.. జీతం వచ్చిన వెంటనే ఖర్చులకు సరైన ప్లాన్ లేకపోవడం కూడా ప్రధాన కారణం కావచ్చు. అందుకే శాలరీ క్రెడిట్ అయిన రోజే కొన్ని విషయాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటే నెల చివర్లో ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని చెప్తున్నారు ఆర్థిక నిపుణులు. . సేవింగ్స్ నుంచి ఖర్చులు దాకా ఇలా ప్లాన్ చేసుకోండి చాలామంది ముందుగా తమ నెల మొత్తం ఖర్చులు చేసి.. చివర్లో ఏమైనా మిగిలితే దానిని సేవ్ చేద్దామని అనుకుంటారు. కానీ ఆ పద్ధతిని ఫాలో అయితే పెద్దగా డబ్బు మిగలదు. అందుకే ముందే సేవింగ్.. తర్వాత ఖర్చులు అనే అలవాటు చేసుకోవడం మంచిది. అంటే జీతం అకౌంట్‌లో పడిన వెంటనే మీకు సాధ్యమైన మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్‌కు పంపేసుకోండి. అది చిన్న మొత్తం అయినా పర్వాలేదు. స్టార్ట్ చేయడమే ముఖ్యం. అలాగే అది అలవాటుగా మారాలి. నెలలో తప్పకుండా చెల్లించాల్సిన ఖర్చులను ముందుగానే రాసుకోవాలి. బడ్జెట్ ప్లానింగ్లో ఇది మరో ప్రధానమైన విషయం. మీకు ఉన్న ఖర్చులు అంటే ఇంటి అద్దె, EMI, కరెంట్, వాటర్, గ్యాస్ బిల్లులు, పిల్లల ఫీజులు, కిరాణా, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు, ఫోన్, ఇంటర్నెట్ బిల్లులు, మందులు లేదా ఇతర తప్పనిసరి ఖర్చులు మొత్తం రాసుకోవాలి. ఇది ఎంత అవుతుందో ముందే తెలుసుకుంటే.. మీ దగ్గర ఖర్చు చేయడానికి ఎంత డబ్బు మిగుతుందో తెలుస్తుంది. ను వాయిదా వేస్తే చివర్లో అన్నీ ఒకేసారి పడతాయి. లేదా వాటి ఇంట్రెస్ట్ రేట్ పెరిగే అవకాశం ఉంది. అందుకే శాలరీ వచ్చిన వెంటనే అవసరమైన బిల్లులు, EMIలు వంటి తప్పనిసరి చెల్లింపులను ముందుగానే పే మంచిది. నెల మొత్తం డబ్బు ఒకేసారి చేతిలో ఉందని భావించి ఖర్చు చేస్తే.. మొదటి 10–15 రోజుల్లోనే ఎక్కువ మొత్తం ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మిగిలిన డబ్బును నెలలోని రోజులకు అనుగుణంగా డివైడ్ చేసుకోవాలి. తప్పనిసరి ఖర్చులు, సేవింగ్స్ అన్నీ పక్కన పెట్టిన తర్వాత మీ దగ్గర ఎంత మిగిలితే.. దాన్ని మొత్తం నెలకు ఎలా ఉపయోగించాలో ముందుగానే ప్లాన్ చేసుకోండి. అలా చేస్తే మొదటి వారంలోనే ఎక్కువ ఖర్చు చేసి చివరి వారంలో ఇబ్బంది పడే పరిస్థితి తగ్గుతుంది. . సింపుల్ బట్ ఎఫెక్టివ్ రోజుకు 100, 200, 300 ఇలా చిన్న చిన్న మొత్తాలు UPI పేమెంట్స్ చేస్తే ఖర్చు పెద్దగా అనిపించదు. కానీ నెల మొత్తం లెక్క వేసుకుంటే ఆ చిన్న ఖర్చులే పెద్దగా మారతాయి. కాబట్టి టీ, కాఫీ, ఫుడ్ డెలివరీ, క్యాబ్, ఆన్‌లైన్ షాపింగ్ వంటి ఖర్చులను ఒకసారి ట్రాక్ చేసుకోండి. డ

Original source: telugu.abplive.com
Read more on Kaizer News