పసుపు పాల ప్రయోజనాల గురించి అందరూ విని ఉంటారు. నిద్రపోయే ముందు ఇలా పసుపు కలిపిన పాలు తాగటం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. అనేక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది. అయితే, పసుపు పాలకు మరో ఐదు పదార్థాలను కలపడం ద్వారా ఒక ప్రత్యేకమైన పంచామృత పాలు తయారవుతాయి.. దీని ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనిని తయారు చేయడం సులభం. ఈ పాలను ప్రతిరోజు రాత్రి కొన్ని వారాల పాటు తీసుకోవడం వల్ల కడుపు, చర్మం రెండింటికీ ప్రయోజనకరమైన ప్రభావాలు కలుగుతాయి. ఆ పంచామృతం పాలు ఎలా తయారు చేయాలి.. ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం