Kaizer News

Poduru: సంచార చికిత్స ద్వారా ఉచిత వైద్యం, మందులు డ

Poduru: సంచార చికిత్స ద్వారా ఉచిత వైద్యం, మందులు డాక్టర్ జి. మణిత్యాగి!

· Health · hmtvlive.com

Poduru: పోడూరు అసంక్రమణ వ్యాధులు అయిన ప్రదానం గా మధుమేహం రక్తపోటు వ్యాధులకు సంచార చికిత్స కార్యక్రమం లో వైద్యాధికారులు చే పరీక్షలు చేయించుకొని ఉచితం గా 30 రోజులు కు మందులు పొందవచ్చును అని వైద్యాధికారి డా జి మణిత్యాగి తెలిపారు. పోడూరు మండలం పెమ్మరాజు పోలవరం సంచార చికిత్స కార్యక్రమం లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ సంచార చికిత్స కార్యక్రమం లో నెల లో నిర్దేశించిన రోజు లో ప్రతి గ్రామం లో నిర్వహించి రక్త పరీక్షలు నిర్వహించడం గర్భిణి స్త్రీలు కు పరీక్షలు చేయడం అదే రోజు దీర్ఘ కాలం వ్యాధులు తో ఇబ్బంది పడే రోగులు ను, ఎన్టీఆర్ వైద్య సేవ లో చేయించుకొన్న రోగులను ఇళ్ల దగ్గర చూడటం ఆ ప్రదేశం లో అంగన్వాడీ కేంద్రం లు స్కూల్ లు పిల్లలు వసతి గృహాలు సందర్శించడం జరుగుతుందని తెలిపారు. పెమ్మరాజు పోలవరం లో 50 మంది రోగులను పరీక్షించి గర్భిణి స్త్రీలు బాలింతలు కు పరీక్షలు చేసి మందులు ఇచ్చారు ఈ కార్యక్రమం లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కె. బి. కె.ఎస్ రమేష్ రెడ్డి ఆరోగ్య విస్తరణ అధికారిజె.సత్యనారాయణ ఎం.ఎల్.హెచ్.పి శాంతి ప్రియ ఆరోగ్య సహాయకులు ఆర్. త్రివేణి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు

Original source: hmtvlive.com
Read more on Kaizer News