కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయల్లో ఒకటి. అయితే దాని ప్రత్యేకమైన చేదు రుచి కారణంగా చాలామంది, ముఖ్యంగా పిల్లలు, కాకరకాయను తినడానికి ఇష్టపడరు. కాకరకాయతో ఎన్నో రకాల వంటకాలు తయారు చేసుకోవచ్చు. కానీ వంట ఎంత బాగా చేసినా చేదు ఎక్కువగా ఉంటే తినడం కష్టంగా మారుతుంది. అందుకే కాకరకాయ చేదును తగ్గించడానికి చాలామంది ఉప్పు, పెరుగు, చింతపండు వంటి పదార్థాలను ఉపయోగిస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్ అరీజ్ ఫాతిమా షేర్ చేసిన ఒక సులభమైన చిట్కా ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది