Kaizer News

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి..

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి..

· Health · prabhanews.com

విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి మాదక ద్రవ్యాలతో ఆరోగ్యం, భవిష్యత్తు నాశనం పాఠశాలల్లో ఖానాపురం హవెలి పోలీసుల అవగాహన నార్కోటిక్‌ డాగ్‌ స్క్వాడ్‌తో విస్తృత తనిఖీలు ఖానాపురం హవెలి సీఐ భానుప్రకాష్ ఖమ్మం, ఆంధ్రప్రభ : విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని ఖానాపురం హవెలి పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాష్‌ సూచించారు. పాండురంగపురం, బల్లేపల్లి గ్రామాల్లోని పలు పాఠశాలల్లో శనివారం ఖానాపురం హవెలి పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై విద్యార్థులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు. మాదక ద్రవ్యాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతోపాటు భవిష్యత్‌ జీవితాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే ఆరోగ్య సమస్యలతోపాటు సామాజిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాఠశాల పరిసరాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. విద్యార్థులకు సురక్షితమైన, మాదక ద్రవ్యాల రహిత వాతావరణాన్ని కల్పించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాష్‌ తెలిపారు. మాదక ద్రవ్యాలపై స్థానిక సమాజంలో అప్రమత్తత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత జీవితంతోపాటు కుటుంబాలు కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వివరించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా మాదక ద్రవ్యాల వినియోగానికి ప్రోత్సహించినా, విక్రయించినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువతను మాదక ద్రవ్యాల బారినుంచి కాపాడేందుకు పోలీసు శాఖ నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. అవగాహన కార్యక్రమంతోపాటు శిక్షణ పొందిన నార్కోటిక్‌ డాగ్‌ స్క్వాడ్‌తో పాఠశాల పరిసరాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాఠశాల ప్రాంగణంతోపాటు సమీపంలోని దుకాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నాయా అనే కోణంలో తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బందిలో భద్రతపై భరోసా కల్పించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. పాఠశాలల చుట్టుపక్కల అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై నిఘా ఉంచాలని సూచించారు. మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత భవిష్యత్తును మాదక ద్రవ్యాల బారినుంచి కాపాడేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఇన్‌స్పెక్టర్‌ భానుప్రకాష్‌ కోరారు. పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు కూడా పోలీసులకు సహకరించాలని సూచించారు

Original source: prabhanews.com
Read more on Kaizer News