సోషల్ మీడియాలో బేకింగ్ సోడా నీరు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందనే ప్రచారం. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందనేది, శరీరాన్ని ఆల్కలైన్ చేయడమనేది శాస్త్రీయం కాదు. దీర్ఘకాలం వాడితే అధిక సోడియం, ఇతర ఆరోగ్య సమస్యలు రావొచ్చు. Drinking Baking Soda Water Every Day : సోషల్ మీడియాలో ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో ట్రెండ్స్ వైరల్ అవుతుంటాయి. వాటిలో ప్రస్తుతం నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి ఉదయాన్నే తాగితే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందని చెప్పే పోస్టులు కనిపిస్తున్నాయి. కొంతమంది దీనిని ఆల్కలైన్ డ్రింక్‌గా ప్రచారం చేస్తున్నారు. మరి నిజంగానే బేకింగ్ సోడా శరీరంలోని వాపు, ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుందా? రోజూ ఇలా తాగడం మంచిదేనా? ఇళ్లలో వంటల్లో, బేకింగ్‌లో ఉపయోగించే బేకింగ్ సోడాను శాస్త్రీయంగా సోడియం బైకార్బొనేట్ అంటారు. ఇది ఒక ఆల్కలైన్ పదార్థం. వైద్యపరంగా కూడా కొన్ని సందర్భాల్లో దీనిని ఉపయోగిస్తుంటారు. కడుపులో అధికంగా ఉండే ఎసిడిటీని తాత్కాలికంగా తగ్గించేందుకు యాంటాసిడ్‌గా ఉపయోగిస్తారు. అయితే వైద్యపరమైన ఉపయోగం ఉందని చెప్పి.. ప్రతి ఒక్కరూ ఆరోగ్య ప్రయోజనాల కోసం రోజూ నీటిలో కలుపుకుని తాగడం మంచిదేనా? . ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు సోడియం బైకార్బొనేట్ శరీరంలోని ఆమ్ల-క్షార సమతుల్యతపై ప్రభావం చూపుతుంది. కొన్ని పరిశోధనల్లో దీనిని తీసుకున్న తర్వాత ఇన్ఫ్లమేషన్లో తాత్కాలిక మార్పులు కనిపించాయి. అయితే దీని ఆధారంగా చేసుకుని బేకింగ్ సోడా నీళ్లు తాగితే శరీరంలోని ఇన్ఫ్లమేషన్ మొత్తం తగ్గిపోతుంది అనుకోవడం సరైంది కాదని చెప్తున్నారు. మరో ట్రైల్లో క్రానిక్ కిడ్నీ సమస్యలు ఉన్న కొంతమంది రోగులు సోడియం బైకార్బొనేట్ తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్లో ఎలాంటి మార్పులు కనిపించలేదట. అంటే దీనిపై పరిశోధన ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేదని అర్థం. కాబట్టి ప్రస్తుతం బేకింగ్ సోడా నీటిని సాధారణ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రింక్‌గా సిఫార్సు చేయకూడదు. ించే మరో క్లెయిమ్‌గా చెప్పవచ్చు. బేకింగ్ సోడా ఆల్కలైన్ పదార్థం అయినప్పటికీ.. దాన్ని తాగడం వల్ల శరీరం మొత్తం ఆల్కలైన్‌గా మారిపోతుందనుకోకూడదని చెప్తున్నారు. అందుకే బేకింగ్ సోడా నీళ్లు తాగి శరీరంలోని యాసిడ్‌ను బయటకు పంపించవచ్చు వంటి వైరల్ న్యూస్ నమ్మకూడదని అంటున్నారు. బేకింగ్ సోడాలో సోడియం ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం భారం పెరగవచ్చు. కడుపులో గ్యాస్, కడుపు తిమ్మిరి, దాహం వంటి సమస్యలు కూడా పెరగవచ్చు. అధిక రక్తపోటు, గుండె వైఫల్యం, కిడ్నీ వ్యాధి ఉన్నవారు లేదా సోడియం తక్కువగా తీసుకోవాలని వైద్యులు చెప్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. MedlinePlus ప్రకారం.. సోడియం బైకార్బొనేట్‌ను వైద్యుల సూచన లేకుండా దీర్ఘకాలం ఉపయోగించకూడదు. ఇతర మందులతో కూడా ఇది రియాక్షన్ చూపే అవకాశం ఉంది కాబట్టి.. ఆరోగ్య సమస్యలతో మందులు వాడేవారు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి. ంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత క