భారతీయ వంటకాల్లో కరివేపాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పప్పు, సాంబార్, చట్నీ, కూరలు, పులిహోర ఇలా ఎన్నో వంటకాలకు కరివేపాకు వేస్తే మంచి సువాసన, రుచి వస్తుంది. అయితే మార్కెట్ నుంచి ఒకేసారి ఎక్కువ కరివేపాకు తెచ్చుకున్నప్పుడు కొన్ని రోజుల్లోనే ఆకులు వాడిపోయి, నల్లగా మారి లేదా తేమ కారణంగా పాడైపోతుంటాయి. దీంతో కొనుగోలు చేసిన కరివేపాకులో కొంత భాగం వృథా అవుతుంది. సరైన పద్ధతిలో శుభ్రం చేసి నిల్వ చేస్తే ఈ సమస్యను చాలావరకు తగ్గించుకోవచ్చు