Kaizer News

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ ఆకా

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ ఆకాశాన్ని తాకుతున్న ధరలు..!

· Business · tv9telugu.com

బంగారం ధరలు మళ్లీ దూకుడు మొదలైంది. గతంలో తగ్గుతూ వచ్చిన ధరలు.. ఇప్పుడు ఆకాశాన్నంటేలా పరుగులు పెడుతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు రికార్డు స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయని కొన్ని నివేదికలు వెలువడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్క రోజే తులం బంగారంపై భారీగా పెరిగింది. డాలర్ విలువ తగ్గితే బంగారం ధరలు వేగంగా పెరగవచ్చని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా, భారతీయ కుటుంబాల వద్ద అధిక మొత్తంలో బంగారం ఉన్నందున, డాలర్ దీర్ఘకాలం పాటు బలహీనపడటం వల్ల భారతదేశానికే అత్యధిక ప్రయోజనం చేకూరుతుంది. తాజాగా సెప్టెంబర్‌ 20 బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.. బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం ముడి చమురు ధర తగ్గడం, అలాగే డాలర్, యూఎస్ ట్రెజరీ దిగుబడులు బలహీనపడటం. వరుసగా మూడవ సెషన్‌లో కూడా చమురు ధరలు తగ్గడంతో, ద్రవ్యోల్బణంపై ఆందోళనలు తగ్గాయి. ఇటీవలి అమ్మకాల తర్వాత పెట్టుబడిదారులు మళ్లీ బులియన్‌ను కొనుగోలు చేయడం ప్రారంభించారు. అయితే అధిక యూఎస్ డాలర్, ట్రెజరీ దిగుబడులు ఇప్పటికీ బంగారం పెరుగుదలపై కొంత ఒత్తిడిని కలిగిస్తున్నాయి. మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Original source: tv9telugu.com
Read more on Kaizer News