Kaizer News

జాబ్ క్రియేటర్లదే భవిష్యత్తు: ఏపీ మాజీ ఐటీ సలహాదార

జాబ్ క్రియేటర్లదే భవిష్యత్తు: ఏపీ మాజీ ఐటీ సలహాదారు డాక్టర్ జె.ఎ. చౌదరి

· Business · v6velugu.com

హైదరాబాద్​, వెలుగు: సంప్రదాయ ఉద్యోగ విధానాన్ని ఏఐ సమూలంగా మార్చేస్తోందని, గ్రాడ్యుయేట్లు క్యాంపస్ రిక్రూట్‌‌‌‌మెంట్ కోసం ఎదురుచూసే కాలం చెల్లిందని ఏపీ మాజీ ఐటీ సలహాదారు డాక్టర్ జె.ఎ. చౌదరి అన్నారు. హైదరాబాద్‌‌‌‌లో శనివారం అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఏఎస్‌‌‌‌బీ) నిర్వహించిన ఇండస్ట్రీ లీడర్‌‌‌‌షిప్ సమిట్​లో ఆయన మాట్లాడుతూ, సమస్యలకు పరిష్కారాలు చూపుతూ, ఉద్యోగాలు సృష్టించగల ఎంట్రప్రెన్యూర్లదే భవిష్యత్తు అని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఐబీఎం, జెన్‌‌‌‌పాక్ట్, మైక్రాన్ టెక్నాలజీ, ఫెడెక్స్ తదితర కంపెనీల సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ వ్యాపార రంగంలో ఏఐ ప్రభావంపై చర్చించారు. డిగ్రీలు ఇవ్వడమే కాకుండా విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఏఎస్‌‌‌‌బీ సెక్రటరీ అర్జున్ కుమార్, డైరెక్టర్ అరిజిత్ సంతికరీ ప్రకటించారు

Original source: v6velugu.com
Read more on Kaizer News