ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన పెట్టుబడిదారుల్లో వారెన్ బఫెట్ ఒకరు. ఎన్నో దశాబ్దాలుగా పెట్టుబడుల రంగంలో కొనసాగుతూ.. తన ప్రత్యేకమైన ఆలోచనా విధానంతో ఎంతో సంపదను సృష్టించిన, బఫెట్ విజయానికి ముఖ్య కారణం కేవలం డబ్బు సంపాదించడం కాదు. ఓర్పు, క్రమశిక్షణ, సరైన నిర్ణయాలు మరియు దీర్ఘకాలిక ఆలోచన ఆయన పెట్టుబడి విధానంలో ముఖ్యమైనవి. ఆయన చెప్పిన కొన్ని విషయాలు షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికే కాకుండా, జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడతాయి. మంచి కంపెనీలను సరైన ధరకు ఎంచుకోవాలి బఫెట్ పెట్టుబడి విధానంలో ముఖ్యమైన విషయం మంచి వ్యాపారాలను గుర్తించడం. ఒక కంపెనీ షేరు ధర పెరుగుతోందని మాత్రమే దాన్ని కొనడం సరైనది కాదు. ఆ కంపెనీ ఏం చేస్తోంది?, దాని వ్యాపారం బలంగా ఉందా?, భవిష్యత్తులో కూడా ఆ కంపెనీ అభివృద్ధి చెందగలదా? అనే విషయాలను ముందుగా తెలుసుకోవాలి. మంచి కంపెనీని గుర్తించడం ఎంత ముఖ్యమో, దాని షేరును సరైన ధరకు కొనడం కూడా అంతే ముఖ్యం. పెట్టుబడుల్లో ఓర్పు ఉండాలి షేర్ మార్కెట్‌లో ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఒకరోజు మార్కెట్ పెరగవచ్చు, మరొకరోజు పడిపోవచ్చు. ఈ మార్పులను చూసి ప్రతిసారీ మన పెట్టుబడులను మార్చుకుంటే నష్టపోయే అవకాశం ఉంటుంది. బఫెట్ మాత్రం దీర్ఘకాలికంగా ఆలోచించేవారు. మంచి కంపెనీలో పెట్టుబడి పెట్టిన తర్వాత, దాని ఎదుగుదలకు తగిన సమయం ఇవ్వాలని ఆయన విధానం చెబుతుంది. మంచి పెట్టుబడికి ఓర్పు చాలా అవసరం. భయం, అత్యాశకు లోనుకాకూడదు మార్కెట్‌లో అందరూ ఒక షేరును కొనుగోలు చేస్తున్నారని మనం కూడా వెంటనే కొనాల్సిన అవసరం లేదు. అలాగే మార్కెట్ పడిపోతున్నప్పుడు భయపడి మన పెట్టుబడులను అమ్మేయాల్సిన అవసరం కూడా లేదు. బఫెట్ ప్రసిద్ధ సూత్రం ఏమిటంటే.. ''ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడండి, ఇతరులు భయపడుతున్నప్పుడు అవకాశాలను చూడండి''. దీని ఉద్దేశం ఇతరులను గుడ్డిగా అనుసరించకుండా, మన సొంత ఆలోచనతో నిర్ణయం తీసుకోవడం. పెద్ద నష్టాలను నివారించాలి పెట్టుబడుల్లో లాభం ఎంత ముఖ్యమో, నష్టాలను నియంత్రించడం కూడా అంతే ముఖ్యం. రూల్ నెం1-ఎప్పుడూ డబ్బును కోల్పోవద్దు. రూల్ నెం. 2: రూల్ నెం. 1ని ఎప్పుడూ మర్చిపోవద్దని బఫెట్ చెబుతారు. ప్రతి పెట్టుబడిలో నష్టం అసలు రాకుండా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కానీ మనకు అర్థం కాని వ్యాపారంలో లేదా ఎక్కువ రిస్క్ ఉన్న పెట్టుబడిలో తొందరగా డబ్బు పెట్టకుండా జాగ్రత్తపడవచ్చు. ఇతరుల మాటలను బట్టి నిర్ణయాలు తీసుకోకూడదు పెట్టుబడుల విషయంలో మన చుట్టూ ఉన్నవాళ్లు కూడా మన నిర్ణయాలను ప్రభావితం చేయవచ్చు. ఎవరో ఒకరు ఒక షేరు చాలా బాగుందని చెబితే వెంటనే కొనడం, ఇంకెవరో మార్కెట్ పడిపోతుందని చెబితే భయపడటం సరైన విధానం కాదు. ముందుగా మనమే విషయాన్ని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఇతరుల అభిప్రాయాలను వినవచ్చు, కానీ తుది నిర్ణయం మాత్రం ఆలోచించి తీసుకోవాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తులు జీవితంలో మనం ఎవరితో కలిసి ఉంటామనేది కూడా చాలా ముఖ్యమని బఫెట్ చెప్పారు. మన స్నేహితులు, మనతో పనిచేసే వ్యక్తులు, మనం గౌరవించే వ్యక్తులు మన ఆలోచనలు మరియు నిర్ణయాలపై ప్రభావం చూపుతారు. అందుకే మంచి ఆలోచనలు ఉన్నవారితో ఉండటం, వారి నుం