Kaizer News

Ants | ఇంట్లో చీమ‌లు ఎక్కువ‌గా ఉంటే.. ఈ స‌హ‌జ‌సిద్

Ants | ఇంట్లో చీమ‌లు ఎక్కువ‌గా ఉంటే.. ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు అద్భుతంగా ప‌నిచేస్తాయి..

· Health · ntnews.com

Ants | ఇంట్లోకి చీమలు రావడం చాలామందికి ఎదురయ్యే సాధారణ సమస్య. ముఖ్యంగా వంటగదిలో ఆహారం, తీపి పదార్థాలు, కింద‌ప‌డిన‌ ఆహార పదార్థాల వాసనకు చీమలు త్వరగా ఆకర్షితమవుతాయి. అయితే ఆహారం మాత్రమే కాదు.. తేమ కూడా చీమలను ఇంట్లోకి రప్పిస్తుంది. అందుకే వంటగది సింక్‌లు, బాత్‌రూమ్‌లు, అల్మారాలు, వార్డ్‌రోబ్‌లలోని దుస్తుల దగ్గర కూడా చీమలు కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు చీమలను కదిలించినప్పుడు అవి కుట్టే అవకాశం కూడా ఉంటుంది. చీమలు విడుదల చేసే ఫార్మిక్ యాసిడ్ కారణంగా చర్మంపై స్వల్ప మంట, చికాకు, ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇంట్లో ఒక్కసారిగా చీమలు ఎక్కువగా కనిపిస్తే, వాటిని దూరంగా ఉంచేందుకు వంటగదిలో సాధారణంగా లభించే కొన్ని పదార్థాలను ఉపయోగించవచ్చు. చీమలు ఇంట్లోకి రావడానికి ప్రధాన కారణాల్లో పరిశుభ్రత లేకపోవడం ఒకటి. నేలపై పడిన ఆహారపు ముక్కలు, చిందిన పదార్థాలు, ఇతర ఆహార అవశేషాలను సరిగా శుభ్రం చేయకపోతే చీమలు వాటికి ఆకర్షితమవుతాయి. ముఖ్యంగా వంటగదిలో ఆహారాన్ని మూత లేకుండా ఉంచడం, తీపి పదార్థాలను బయట ఉంచడం వల్ల చీమలు సులభంగా అక్కడికి చేరుతాయి. నీటి కోసం కూడా చీమలు ఇంట్లోకి వస్తుంటాయి. తడిగా ఉండే ప్రదేశాలు, వంటగది సింక్‌లు, బాత్‌రూమ్‌లు, లీక్ అవుతున్న న‌ల్లాల దగ్గర ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే తీవ్రమైన ఎండ, భారీ వర్షాలు లేదా చలి సమయంలో బయట వాతావరణం నుంచి రక్షణ కోసం చీమలు ఇంట్లోకి చేరి గూడు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. చీమలు ఆహారం లేదా నీటి మార్గాన్ని గుర్తించేందుకు ఫెరోమోన్ అనే రసాయన సంకేతాల ఆధారంగా ఏర్పడే వాసన మార్గాలను ఉపయోగిస్తాయి. ఘాటైన వాసన కలిగిన కొన్ని పదార్థాలు ఈ మార్గాలను అంతరాయం కలిగిస్తాయి. దీంతో చీమలకు ఆహారం లేదా నీటి దారి గుర్తించడం కష్టమవుతుంది. ఇంట్లో చీమలు కనిపించే ప్రదేశాల్లో వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. సమాన పరిమాణంలో వైట్ వెనిగర్, నీటిని కలిపి స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వంటగది కౌంటర్‌లు, కిటికీలు, తలుపుల ఫ్రేమ్‌లు, చీమలు లోపలికి వచ్చే మార్గాల్లో స్ప్రే చేయవచ్చు. నేలను తుడిచే నీటిలో కొద్దిగా వెనిగర్ కలపడం వ‌ల్ల కూడా చీమ‌ల‌ను దూరంగా ఉంచ‌వ‌చ్చు. బిర్యానీ ఆకులు లేదా బే లీవ్స్‌ను కూడా చీమలను దూరంగా ఉంచేందుకు ఉపయోగించవచ్చు. వీటి ఘాటైన వాసన చీమలకు నచ్చదు. కొన్ని బే లీవ్స్‌ను స్వల్పంగా నలిపి చీమలు కనిపించే ప్రాంతాల్లో, తలుపులు లేదా కిటికీల దగ్గర అలాగే చక్కెర డబ్బాలు, తీపి పదార్థాలు ఉంచే ప్రదేశాల దగ్గర పెట్టాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చీమ‌లు ఆహార ప‌దార్థాల‌కు దూరంగా ఉంటాయి. పసుపు కూడా ఇంట్లో చీమలను నివారించేందుకు ఉపయోగించే మరో సాధారణ వంటింటి పదార్థం. పసుపు వాసన చీమలను నిరుత్సాహపరుస్తుంది. చీమలు ఇంట్లోకి ప్రవేశించే తలుపులు, కిటికీలు లేదా ఇతర ప్రదేశాల దగ్గర పసుపు పొడితో పలుచని గీతలా చ‌ల్లాలి. ఎర్ర మిరపకాయ, ఉప్పుతో తయారు చేసిన స్ప్రేను కూడా మ‌నం ఉపయోగించవచ్చు. ఇందుకోసం ఒకటి నుంచి రెండు గ్లాసుల నీటిలో ఒక చెంచా ఉప్పు, ఒకటి నుంచి రెండు చెంచాల ఎర్ర మిరప పొడి వేసి మరిగించాలి. ఆ మిశ్రమం కొద్దిగా చిక్కగా అయ్యాక పూర్తిగా చల్లారనివ్వాలి. అనంతరం వడకట్టి స్ప్రే బాటిల్‌లో పోసుకున

Original source: ntnews.com
Read more on Kaizer News